చంద్రునికి మరింత చేరువగా చంద్రయాన్- 3

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చందమామపైకి ప్రయోగించిన చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ విజయవంతంగా లక్ష్యం వైపు దూసుకెళ్తోంది. ఇప్పటికే భూ బాహ్య కక్ష్యను దాటించి స్పేస్‌క్రాఫ్ట్‌ను చంద్రుడి క్షక్ష్యలోకి పంపిన ఇస్రో శాస్త్రవేత్తలు.. ఇప్పుడు దానిని చంద్రుడికి చేరువ చేస్తున్నారు. ఇప్పటివరకు మూడు సార్లు చంద్రయాన్‌-3 కక్ష్యను తగ్గించగా.. సోమవారం ఉదయం నాలుగోసారి కూడా సక్సెస్‌ఫుల్‌గా చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ కక్ష్యను తగ్గించారు.

దాంతో చంద్రయాన్‌-3 మిషన్‌ చందమామకు మరింత చేరువైంది. ప్రస్తుతం చంద్రుడికి 150 కిలోమీటర్లు X 177 కిలోమీటర్ల కక్ష్యలో చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ ఉన్నది. ఈ నెల 16న ఉదయం 8.30 గంటలకు మరోసారి స్పేస్‌క్రాఫ్ట్‌ కక్ష్యను తగ్గించనున్నారు. దాంతో అది చంద్రుడికి 100 కిలోమీటర్ల సమీపంలోని కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అనంతరం చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ మాడ్యూల్‌ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి వేరుపడి చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది.

Leave A Reply

Your email address will not be published.