వినువీధిలో కొత్త నక్షత్రాన్ని కనిపెట్టిన భారతీయ శాస్త్రవేత్తలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వినువీధిలో కొత్త నక్షత్రం ప్రత్యక్షమైంది. తాజాగా భారతీయ శాస్త్రవేత్తలే ఆ నక్షత్రాన్ని కనిపెట్టారు. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌ కు చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో కొత్త నక్షత్రం వెలుగులోకి వచ్చింది. ఈ నక్షత్రానికి సైంటిస్టులు HE 1005 – 1439 అని పేరు పెట్టారు. దీన్ని ‘కార్బన్‌ ఎన్‌హాన్స్‌డ్‌ మెటల్‌ పూర్‌ (CEMP) స్టార్‌గా వర్గీకరించారు.ఈ నక్షత్రాన్ని పరిశీలిస్తే రెండు వేర్వేరు న్యూట్రాన్‌ – క్యాప్చర్‌ ప్రాసెసెస్‌ల కాంబినేషన్‌తో ఏర్పాటైనట్టు తెలుస్తున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ రెండు న్యూట్రాన్‌ – క్యాప్చర్‌ ప్రాసెసెస్‌లలో ఒకటి స్లో (s-) న్యూట్రాన్‌ – క్యాప్చర్‌ ప్రాసెస్‌ కాగా, మరొకటి ఇంటర్మీడియట్‌ (i-) న్యూట్రాన్‌ – క్యాప్చర్‌ ప్రాసెస్‌ అని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.