ప్రపంచాన్నే మేల్కొలిపే సామర్థ్యం భారత్‌కు ఉంది

-  రాష్ట్రీ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రపంచాన్నే మేల్కొలిపే సామర్థ్యం భారత్‌కు ఉందని రాష్ట్రీ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన బెంగళూరులో ఆయన జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం తన సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాంస్కృతిక శక్తి, సామర్థ్యాల ఆధారంగా దేశం ప్రపంచానికి ఆశాకిరణంగా మారుతుందని సంఘ్‌ చీఫ్‌ పేర్కొన్నారు. దేశ వ్యతిరేక శక్తులకు మనం ముందుకెళ్లడం ఇష్టంలేదని, దేశ పురోగతిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయన్నారు.వారి పట్ల జాగ్రత్తగా ఉంటూ మన జాతీయ జెండాలో దాగి ఉన్న సందేశానికి అనుగుణంగా పని చేస్తూ దేశాన్ని సమైక్యంగా ఉంచాలన్నారు. తద్వారా వ్యతిరేక శక్తులు విజయం సాధించలేవన్నారు. జాతీయ జెండాలోని కాషాయరంగు త్యాగాన్ని సూచిస్తుందని, జీవితాన్ని తమసో మా జ్యోతిర్గమయ (చీకటి నుండి వెలుగులోకి) దిశలో నడిపిస్తుందన్నారు. తెలుపు రంగు స్వార్థం లేకుండా స్వచ్ఛత సూచిస్తుందని, ఆకుపచ్చ రంగు లక్ష్మీ (సంపద)ని సూచిస్తుందన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.