శరీర అవయవ దానంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ వంజరి సంఘం ఆధ్వర్యంలో తార్నాక సంఘ కార్యాలయంలో జరిగిన 77వ స్వతంత్ర వేడుక దినోత్సవంలో భాగంగా శరీర అవయవ దానం పై అవగాహన సదస్సును నిర్వహించారు.అఖిలభారత శరీర అవయవదాతల సంఘం తెలంగాణ విభాగం మరియు తెలంగాణ వంజరి సంఘం సంయుక్త నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో శరీర అవయవ దానంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని వీటిపై విస్తృత ప్రచారం జరగాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు.శరీర అవయవ దానం పట్ల వంజరి కులస్తులు అవగాహన పెంచుకొని వీటిని ప్రోత్సహించాలని మరొకరికి పునర్జన్మనూతన జీవిత అవకాశాలు మెరుగుపరిచే విధంగా ,మానవతాస్ఫూర్తితో మనుషులంతా ముందుకు రావాలనిసమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది.ఇటీవల ప్రపంచ అవయవధానం ఆగస్టు 6 నుండి 13 వరకు 20 వారోత్సవాలు నిర్వహించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించిన అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం వ్యవస్థాపకురాలు డాక్టర్ కాట్రగడ్డ భారతి సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి లను సమావేశం అభినందించింది .             అఖిలభారత శరీర అవయవదాతల సంఘం తెలంగాణ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుపోత్నాక్( పిట్టల) అంజయ్య వంజరి   ఈ కార్యక్రమంలో తెలంగాణ వంజరి సంఘం అధ్యక్షులు కాలేరు నరేష్ ప్రధాన కార్యదర్శి కందారి వెంకటేశం కోశాధికారి కాలేరు అమరేందర్ సలహాదారులు కాలేరు రామోజీ మాజీ అధ్యక్షులు కాలేరు విశ్వనాథం అఖిలభారత శరీర అవయవదాతల సంఘం తెలంగాణ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురు ప్రకాష్ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.