రాగల రెండు రోజులు భారీ వర్షాలు

.. వెల్లడించిన వాతావరణ శాఖ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రాగల రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌కుమ్రంభీం ఆసిఫాబాద్‌మంచిర్యాలనిర్మల్‌నిజామాబాద్‌జయశంకర్‌ భూపాలపల్లిములుగుభద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది.జగిత్యాలరాజన్న సిరిసిల్లకరీంనగర్‌పెద్దపల్లిజయశంకర్‌ భూపాలపల్లికొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములుమెరుపులతో వానలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్‌కుమ్రంభీం ఆసిఫాబాద్‌మంచిర్యాలనిర్మల్‌నిజామాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే భారీ వర్షాలుజగిత్యాలసిరిసిల్లపెద్దపల్లికరీంనగర్‌ జిల్లాల్లో ఉరుములుమెరుపులతో వర్షాలు కురిసే అవకశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది.

Leave A Reply

Your email address will not be published.