ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూములు కేటాయించాలి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఇల్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ లు కేటాయించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ రామంతపూర్ లో 48 గంటల నిరసన ధర్నాకు ఈరోజు దిగారు ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇల్లు లేని నిరుపేదలు దరఖాస్తుదారులు, పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ,సీనియర్ నాయకులు  ప్రజలుపాల్గొన్నారు  ఈ ధర్నాను ఉద్దేశించి   మాజీ శాసనసభ్యులు ప్రభాకర్  ప్రసంగిస్తూ గత తొమ్మిది సంవత్సరాలు నుంచి ఇదిగో డబల్ బెడ్ రూమ్, అదిగో డబల్ బెడ్ రూమ్ అని ముఖ్యమంత్రి కాలయాపన చేస్తూ పేద ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నాడని తీవ్రంగా మండిపడ్డారు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని పారదర్శకత లోపించిందని   బి ఆర్ ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మూడు లక్షలు ఇస్తేనే డబల్ బెడ్ రూమ్, ఐదు లక్షలు ఇస్తేనే దళిత బందు, 15 వేలు ఇస్తేనే బీసీ బందు అని  లబ్ధిదారుల నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారని ప్రభాకర్ తీవ్రంగా ఆరోపించారు నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కట్టిన డబల్ బెడ్ రూములు తప్పించి  కొత్తగా ఈ నాలుగు సంవత్సరాల కాలంలోఉప్పల్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు,  మేయర్ ఒక ఇల్లు కట్టక పోగా లంచాలకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలియజేశారు ప్రధానమంత్రి నిధులతోనే పీఎం ఆవాస్ యోజన కింద కట్టారు అని అనడానికి నిదర్శనం ఇండ్ల పైన వేసిన లోగోలే కనబడుతున్నాయని ప్రభాకర్ పేర్కొన్నారు  ప్రజల్ని మోసగించడంలో వంచించడంలో కేసీఆర్ తనకు తానే సాటి అని అనేక సందర్భాల్లో పథకాల అమల్లో  రుజువు చేసుకున్నాడని  అని పేర్కొంటూ  ఈ ఇండ్ల వ్యవహారాల్లో ముఖ్యమంత్రిని వదిలిపెట్టేది లేదని చెప్పండి ప్రభాకర్ హెచ్చరించారు  అందరి దరఖాస్తులు పరిశీలించకపోతే   కలెక్టర్ కార్యాలయముట్టడి చేయడమే కాకుండా బందుకు కూడా పిలిపిస్తామని హెచ్చరించారు

Leave A Reply

Your email address will not be published.