రేపే బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు రేపు సోమవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సంవత్సరం చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జీవితాన్ని విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 21న తెలంగాణ సీఎం బిఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది 105 మంది అభ్యర్థులను కేసీఆర్ విడుదల చేయనున్నారు. మిగిలిన అభ్యర్థుల జాబితాను ఈనెల 25న విడుదల చేస్తారని ప్రచారం కొనసాగుతుంది. సోమవారం ఉదయం 11 గంటలకు అభ్యర్థుల జాబితాను కేసీఆర్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. తెలంగాణ అసెంబ్లీలో బిఆర్ఎస్ కు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీకి సొంతంగా 88 మంది ఎమ్మెల్యేలను కైవసం చేసుకుంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని కెసిఆర్ భావిస్తున్నారు. రేపు ఒక మంచి ముహూర్తం ఉండడంతో అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా ఈ దఫా 11 మంది సెట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వవద్దని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆదిలాబాద్ లో నలుగురు, కరీంనగర్ లో ఇద్దరూ, ఖమ్మంలో ఇద్దరు, వరంగల్లో ఇద్దరు, జిహెచ్ఎంసి పరిధిలో ఒక్క సెట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వవద్దని సీఎం భావిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో 10 నుండి 15 అసెంబ్లీ స్థానాల్లో అసమ్మతి సెగ నెలకొంది సిట్టింగ్లకు సీట్లు ఇవ్వవద్దని కోరుతున్నారు. అయితే ఈ అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్లను కాదని వైరి వర్గం డిమాండ్లను కెసిఆర్ పట్టించుకుంటారా అనేది అభ్యర్థుల జాబితాతో తేలనుంది. తెలంగాణలో మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కలుపుతున్నారు గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను మాత్రమే ఈ దఫా అసెంబ్లీ బరిలో దింపనున్నారు. ఈ వేరకు పలు సర్వేలను టిఆర్ఎస్ నాయకత్వం నిర్వహిస్తుంది. టిక్కెట్లు దక్కని అభ్యర్థులకు ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తామని కేసీఆర్ హామీ ఇస్తున్నారు. సిట్టింగ్ ఇవ్వని అభ్యర్థులను పిలిపించి కేసీఆర్ మాట్లాడుతున్నారు అయితే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కేటీఆర్ ను కలిసి ఈ దఫా తమకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.