మునుగోడు ఉప ఎన్నికలపై జూమ్ మీటింగ్

..టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికలపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జ్ ఆర్. దామోదర్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, నదీమ్ జావిద్ రోహిత్ చౌడరీ, షబ్బీర్ అలీ, మల్లు రవి, సంపత్ కుమార్, శంకర్ నాయక్, అనిల్ రెడ్డి, చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలంగా పోరాటం చేస్తుంది. నిన్న జరిగిన నామినేషన్ కార్యక్రమాలు, సభ మిగతా పార్టీలకంటే అద్భుతంగా చేసాం. నాయకులంతా కలిసికట్టుగా కృషి చేసి పెద్దఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిన్న సభను జయప్రదం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు అన్నారు. కాంగ్రెస్ సభ పెద్దఎత్తున విజయవంతం అవడం తో బెంబేలెత్తిన అధికార పార్టీలు ఫిరాయింపులను అడ్డగోలుగా చేసేందుకు దిగజారిపోయాయి, మనం బూత్ లెవెల్ నాయకులను సిద్ధం చేసుకుంటే వారిని కూడా కొంటున్నారన్నారు. ఇప్పటి వరకు మనం అద్భుతంగా పని చేసాము. ఇక నుంచి మరింత అప్రమతంగా ఉండాలి. టిఆర్ఎస్, బీజేపీ లు మరింత దిగజారి పోయి నాయకులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు. మనం తిప్పికొట్టాలి అని సూచించారు. 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 4 రోజుల పాటు తాను నియోజకవర్గంలోనే ఉండి గ్రామగ్రామాన ప్రచారంలో పాల్గొంటాను అని జూమ్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వేం నరేందర్ రెడ్డి ప్రచార కార్యక్రమాలను ప్రణాళిక చేస్తారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వాళ్లు పూర్తి సమయం అక్కడే కేటాయించాలి. 31వ తేదీన ఇందిరాగాంధీ వర్ధంతి నాడు హైదరబాద్ లో భారత్ జోడో భారీ ప్రదర్శన ఉంటుంది. ఆ రోజు మునుగోడు క్యాడర్, నాయకులు పాల్గొంటారు. ఎన్నికలు అయ్యే వరకు ప్రచార బాద్యతల్లో ఉన్నవారు ఎవరు నియజక వర్గాన్ని విడిచిపెట్టవద్దు. నవంబర్ 3వ తేదీ తర్వాత మునుగోడు ఎన్నికలలో పని చేసిన వారితో రాహుల్ గాంధీ గారితో జోడో యాత్రలో ప్రత్యేకంగా పాల్గొనే విదంగా ఏర్పాటు చేస్తున్నాం. మూడు రోజులపాటు రాహుల్ గాంధీ తో మునుగోడు లో పని చేసిన వారు ఉంటారని, మునుగోడు ఎన్నికలు మన పార్టీ కి అత్యంత ప్రతిష్టాత్మకం.. ఎవ్వరు నిర్లక్షంగా ఉండవద్దు. కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు చాలా బాగా పని చేస్తున్నారన్నారు. అయితే బీజేపీ, టిఆర్ఎస్ లు అడ్డగోలు కొనాగోళ్లకు పాల్పడుతూ కాంగ్రెస్ పైన తీవ్రమైన వత్తిడి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ, టిఆర్ఎస్ నాయకుల అక్రమాలను, అవినీతిని అడ్డుకునేందుకు గ్రామాలకు వస్తున్న ఆయా పార్టీల నాయకులను నిలాడేసేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. మనిక్కమ్ ఠాగూర్ ఏఐసీసీ ఇంచార్జ్ మునుగోడు ఉప ఎన్నికలు భారత్ జోడో యాత్ర రెండు మనకు చాలా కీలకం. జోడో యాత్ర జాతీయ స్థాయి లో ఎంత కీలకమో, మునుగోడు తెలంగాణ లో అంత ముఖ్యం. ఇప్పుడు నాయకులు వారి పనితనం చూపించాలి. చిన్న నిర్లక్షం కూడా ఉండకూడదు. రెండు కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలి.

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రచార కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టాలి. గ్రామాలలో కరపత్రాలు, డోర్ పోస్టర్లు, మరింత వేగంగా పంచి పెట్టాలి. రెండు మూడు రోజులకొకసారి కొత్త కరపత్రాలు పంచాలి. అన్ని వర్గాల ప్రజలను కలిసి ఓట్లు అడగాలి.. ఆయా వర్గాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. గ్రామాల వారీగా యూనిట్ చేసి ప్రచార కార్యక్రమాలను.లోతుగా చేపట్టాలి. భట్టి విక్రమార్క సీఎల్పీ నేత మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ క్యాడర్ బాగా పని చేస్తుంది. ఇంత వత్తిడి లో కూడా నిన్న సభను పెద్ద ఎత్తున విజయవంతం చేశారు.. ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను. ఇంకా, సీతక్క, షబ్బీర్ అలీ, మల్లు రవి, సంపత్ కుమార్, దామోదర్ రెడ్డి, చెరుకు సుధాకర్, తదితరులు మాట్లాడుతు మహిళలను, బిసిలు, దళితులు, మైనారిటీ లు వర్గాల వారీగా ప్రచార వ్యూహాలు రూపొందించాలని సూచించారు. ఇంటింటి ప్రచారంతో పాటు ప్రచార కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విజయవంతం చేసేందుకు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.