పరుగు బంగారాలకు సీఎం కెసిఆర్ ప్రోత్సాహం

-  అథ్లెటిక్స్ స్టేట్ మీట్ లో సాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అన్ని రంగాల్లో యువతరాన్ని విజేతలుగా నిలపడం కోసం సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహన్ని ఉపయోగించుకొని  విశ్వ విజేతలుగా ఎదగాలని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ నవతరానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లోని గోల్కొండ ఫోర్ట్ “అర్టిలరి సెంటర్  స్టేడియంలో  ఆదివారం తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మిడిల్ మరియు లాంగ్ డిస్టెన్స్  మీట్ ను నిర్వహించారు.రాష్ట్రంలో ని 33 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో క్రీడా కారులు ఈ రాష్ట్ర స్థాయి పరుగుల పోటీ లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రం నుంచి కూడా ఉసేన్ బోల్ట్, పీటీ ఉషా లు రావాలన్నదే కేసీఆర్ ప్రభుత్వ ఆశయమన్నారు.తెలంగాణ యువత ఒలంపిక్స్ లో బంగారు పతకాలు సాధించి,రాష్ట్ర ప్రతిష్టను విపణి కి చాటాలన్నారు.స్వరాష్ట్రం లో క్రీడా రంగంలో కూడా ఆత్మ విశ్వాసం పెరిగిందని, నిఖత్,ఉసాముద్దీన్,ఈషా సింగ్, నందిని తదితర రాష్ట్ర క్రీడా కారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారని వివరించారు.పల్లెల్లోంచి ప్రపంచ చాంపియన్ లు రావడమే  కేసీఆర్ ప్రభుత్వ సంకల్పమని అన్నారు.మిడిల్ మరియు లాంగ్ డిస్టెన్స్ పరుగు పోటీలలో విజేతలకు మెడల్స్ మరియు సర్టిఫికేట్స్ ను అందజేశారు. ఈ స్టేట్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు స్టాన్లీ జోన్స్,సారంగపాణి,ప్రతినిధులు ప్రొఫెసర్ రాజేష్, ద్రోణాచార్య అవార్డీ రమేష్,వెంకటేశ్వర్ రెడ్డి, స్వాములు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.