రాజీవ్‌ గాంధీ రాజకీయ జీవితం అత్యంత దారుణమైన రీతి లో ముగిసింది

-  ఆయన సతీమణి, కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ రాజకీయ జీవితం అత్యంత దారుణమైన రీతి లో ముగిసిందని ఆయన సతీమణి, కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ అన్నారు. అయితే, ఆయన తన కొద్ది రోజుల పాలనలోనే లెక్కలేనన్ని విజయాలు సాధించారని చెప్పారు. ఆదివారం జరిగిన 25వ రాజీవ్‌ గాంధీ జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం లో సోనియా పాల్గొని ప్రసంగించారు. మాజీ ప్రధాని రాజకీయ జీవితం చాలా క్రూరమైన రీతిలో ముగిసిందని అన్నారు. ‘రాజీవ్‌ గాంధీ రాజకీయ జీవితం చాలా క్రూరమైన రీతిలో ముగిసింది. కానీ అతి తక్కువ సమయంలోనే అనేక మైలు రాళ్లను సాధించారు. ఆయన దేశ వైవిధ్యం పట్ల చాలా సున్నితంగా ఉండేవారు. ఎంతో అంకిత భావంతో పనిచేశారు. మహిళా సాధికారత, పంచాయతీ, మున్సిపల్‌ కార్పొరేషన్లలో 1/3 వంతు మహిళల రిజర్వేషన్‌ కోసం ఎంతగానో పోరాడారు. నేడు 15 లక్షల మందికిపైగా ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు గ్రామీణ, పట్టణ సంస్థల్లో ఉన్నారంటే అది కేవలం రాజీవ్‌గాంధీ కృషి, దూరదృష్టి వల్లనే. అదేవిధంగా ఓటు వేసే వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు’ అని సోనియా వివరించారు.

Leave A Reply

Your email address will not be published.