బీసీల చెవిలో గులాబీ పువ్వు..దాసు సురేశ్

- 27 న ఓరుగల్లు బీసీ రాజ్యాధికార ఘర్జన - బీసీ రాజ్యాధికార సమితి పిలుపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వెలువడించిన అసెంబ్లీ ఎన్నికల జాబితాలో బీసీలను దారుణంగా అవమాన పరిచారని  బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ హనుమకొండలో హరిత కాకతీయ హోటల్లో నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో పేర్కొన్నారు.. 72 స్థానాల్లో 60 శాతం మేరకు ఉన్న బీసీ జనాభాను గంజిలో ఈగల్లాగ పరిగణించి వారి సంఖ్యను కేవలం 24 కు పరిమితం చేశారన్నారు..సోమవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో 60 శాతం పైబడిన బీసీ జనాభా గలిగిన 41 స్థానాల సమాచారాన్ని మీడియాకు వెల్లడించారు..అధికారంలో ఉన్న ప్రభుత్వం  బీసీల లెక్కలు చెప్పకపోయినా తాము  ఏయే స్థానాల్లో బలంగా ఉన్నామో తమకు తెలుసునన్నారు..బీసీలకు ప్రధాన పార్టీలు అద్దె కొంపలే నని సొంత ఇంటి నిర్మాణానికి బీసీ లు సిద్దమవుతున్నారన్నారు.. గడిచిన 3 నెలలుగా తాము బీసీ లు అత్యధికంగా ఉన్న నియోజక వర్గాలను ప్రకటిస్తున్నా బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా పరిగణించక పోవడం భవిష్యత్తులో వారికి ప్రమాదమే నన్నారు .. బీసీ ప్రాతినిధ్య స్థానాలలో పోటీకి దిగటానికై బలమైన బీసీ నాయకులతో తమ నివేదిక సిద్ధం చేసుకుంటున్నామన్నారు.. ఇందుకోసం ఈ నెల 27 వ తేదీన ఓరుగల్లులో స్థానిక సంస్థల బీసీ నేతలు , కుల సంఘాల నాయకులు, విద్యార్థి , ఉద్యోగ , వ్యాపార , ప్రజా ఉద్యమ సంఘాల బీసీ నాయకులతో ఘనంగాబీసీ రాజ్యాధికార గర్జన నిర్వహిస్తున్నామన్నారు..ఆహ్వాన కమిటీ చైర్మన్ గా ధర్మపురి రామారావు.. ముఖ్య సలహాదారులుగా దారం జనార్దన్,చందా మల్లయ్య, కన్వీనర్లుగా పొదిల రాజు, కేడల ప్రసాద్ , గాజు యుగేందర్ , కీర్తి జయంత్..,మీడియా ఇంచార్జి గా ఆడెపు నగేష్,ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇంచార్జి గా మడత కిశోర్ ,ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఐతం నగేష్ ,రంగు వెంకటేశ్వర్లు లను ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.