హ‌వాయి ద్వీపం లో కార్చిచ్చు..పెను విషాదం

-    సుమారు 800 మంది మిస్సింగ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అమెరికా ద్వీప‌మైన హ‌వాయిలో కార్చిచ్చుపెను విషాదాన్ని మిగిల్చిన విష‌యం తెలిసిందే. ఆ భారీ దావాన‌లం ధాటికి ఆ ద్వీపంలోని ల‌హైనా ప‌ట్ట‌ణంలో అనూహ్య‌మైన విధ్వంసం చోటుచేసుకున్న‌ది. రాత్రికి రాత్రే వ‌చ్చిన ఆ కార్చిచ్చులో వంద‌ల సంఖ్య‌లో ఇండ్లు కాలిపోయాయి. అనేక బిల్డింగ్‌లు ధ్వంసం అయ్యాయి. అయితే ఆ ప్ర‌మాదంలో సుమారు 800 మంది మిస్సింగ్ అయిన‌ట్లు కూడా తెలుస్తోంది. ఆ అగ్నికీల‌ల నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో చాలా మంది స‌ముద్రంలో దూకారు. కొంద‌రు కార్ల‌లోనే కాలిపోయారు. కొంద‌రు ఆచూకీ లేకుండాపోయారు.ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా 800 మంది లెక్క దొర‌క‌డం లేద‌ని అధికారులు చెబుతున్నారు. మ‌వాయి మేయ‌ర్ రిచ‌ర్డ్ బిస్సేన్ ప్ర‌కారం 850 మంది మిస్సింగ్‌లో ఉన్నారు. అయితే అధ్య‌క్ష‌డు బైడెన్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సోమ‌వారం వైట్‌హౌజ్ కూడా ఓ ప్ర‌క‌ట‌న చేసింది. శ్వేత‌సౌధం సెక్యూర్టీ అడ్వైజ‌ర్‌ ప్ర‌కారం సుమారు 500 నుంచి 800 మంది వ‌ర‌కు మిస్సింగ్ జాబితాలో ఉన్న‌ట్లు తెలిపారు. ఇక అమెరిక‌న్ రెడ్ క్రాస్ సొసైటీ త‌మ జాబితాను కూడా రిలీజ్ చేసింది.

Leave A Reply

Your email address will not be published.