స్పేస్‌ మాడ్యూల్ మాడ్యూల్‌లోని ఇంజిన్లు ఆఫ్ కాలేదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ర‌ష్యా స్పేస్‌ మాడ్యూల్ లూనా-25 చంద్రుడిపై కూలిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ప్ర‌యోగం విఫ‌లం కావ‌డానికి గ‌త కార‌ణాల‌ను ర‌ష్యా అంత‌రిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ వెల్ల‌డించింది. ఆ ఏజెన్సీ అధిప‌తి యూరి బోరిసోవ్ కొన్ని విష‌యాల‌ను తెలిపారు. నిర్దేశిత స‌మ‌యంలో ఆ మాడ్యూల్‌లోని ఇంజిన్లు ఆఫ్ కాలేద‌ని అన్నారు. దాంతో ఆ లూనా-25 అనుకున్న క‌క్ష్య‌ను దాటి మ‌రో క‌క్ష్య‌లోకి వెళ్లిన‌ట్లు చెప్పారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు తాము అనుకున్న‌ట్లు ఇంజిన్ ష‌టౌడ‌న్ కాలేద‌ని, ముందుగా అనుకున్న‌ట్లు 84 సెక్ల‌న‌లో ఇంజిన్ ఆఫ్ కావాల‌ని, కానీ ఆ ప్ర‌క్రియ జ‌రిగేందుకు 127 సెకన్లు ప‌ట్టింద‌ని, దాంతో లూనా-25 కూలి పోవాల్సి వ‌చ్చింద‌ని బోరిసోవ్ తెలిపారు.ఇంజిన్లు అనుకున్న స‌మ‌యానికి ఆఫ్ కాక‌పోవ‌డం వ‌ల్లే లూనా-25 మిష‌న్ ఫెయిల్ అయిన‌ట్లు బోరిసోవ్ వెల్ల‌డించారు. ఇదే ప్ర‌ధాన కార‌ణ‌మ‌న్నారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత లోతుగా విచార‌ణ చేప‌ట్టేందుకు ప్ర‌త్యేక క‌మీష‌న్ ఏర్పాటు చేశామ‌న్నారు. ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్‌లో మిష‌న్ ఆప‌రేష‌న్ స‌రిగా జ‌ర‌గ‌క‌పోవ‌డం వ‌ల్ల .. లూనార్ ఆర్బిట్ నుంచి వ్యోమ‌నౌక ముందుకు వెళ్లింద‌ని, దాని వ‌ల్ల అది చంద్రుడిపై కూలింద‌ని ఆయ‌న తెలిపారు.మిష‌న్ విఫ‌ల‌మైనా, తమ స్పేస్ ఇంజినీర్లు విలువైన అనుభ‌వాన్ని గ్ర‌హించార‌న్నారు. ఈ మిష‌న్‌లో జ‌రిగిన పొర‌పాట్ల‌ను అన్నింటినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌న్నారు. లూనా-26, 27, 28 మిష‌న్లు భ‌విష్య‌త్తులో స‌క్సెస్ అవుతాయ‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. చంద్రుడిపై ద‌క్షిణ ద్రువం అత్యంత క్లిష్ట‌మైంది. అక్క‌డి ప్రాంతం అంతా ఎగుడుదిగుడుగా ఉంటుంది. చాలా వ‌ర‌కు దేశాలు త‌మ ల్యాండ‌ర్ల‌ను చంద్రుడి ఈక్వేట‌ర్ ప్రాంతంలో దించాయి.ర‌ష్యా స్పేస్ ఏజెన్సీకి చెందిన సీనియ‌ర్ శాస్త్ర‌వేత్త, 90 ఏళ్ల మిఖైల్ మారోవ్ ఆరోగ్యం అక‌స్మాత్తుగా క్షీణించింది. ఆయ‌న్ను ప్ర‌స్తుతం క్రిమ్లిన్‌లో ఉన్న సెంట్ర‌ల్ క్లినిక‌ల్ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. లూనా-25 మిష‌న్ విఫ‌లం కావ‌డంతో ఆయ‌న స‌డెన్‌గా అనారోగ్యానికి గురైన‌ట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.