మల్లన్న రూటే సపరేట్..మునుగోడులో మజాకానా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తన సైన్యాన్ని అంతటినీ మోహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రులు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది. మల్లారెడ్డికి కూడా ఓ ఎంపీటీసీ స్థానంలో బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఆయన సొంత నియోజకవర్గం మేడ్చల్ నుంచి 200 మంది టీఆర్ఎస్ కార్యకర్తలతో వాలిపోయారు. ఇక ఆ ఎంపీటీసీ స్థానం పరిధిలోని ఓటర్లు టీఆర్ఎస్ కార్యకర్తలకు అంతా తానే అయి చూసుకుంటున్నారు.ప్రజలకు అధికారులతో పని కావాలంటే నేరుగా మాట్లాడి చేసి పెడుతున్నారు. గుడి కావాలంటే అక్కడికక్కడే రూ.లక్షలు ఇస్తున్నారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి తన బోధనాస్పత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. సర్జరీలు అవసరమైతే అవీ ఉచితంగానే చేయిస్తున్నారు. ఇక పార్టీ మారతామంటే ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు నాయకులకు తాయిలాలు సరేసరి. దీంతోపాటు ఎంపీటీసీ స్థానం పరిధిలోని పరిసర గ్రామాల్లోనూ మల్లారెడ్డి అన్నీ తానై అయి చక్కబెడుతున్నారు. దీన్నంటినీ చూసినవారు మల్లన్నా..? మజాకానా..అంటున్నారు.  

Leave A Reply

Your email address will not be published.