విమాన ప్రమాదంలో ర‌ష్యా తిరుగుబాటు నేత ప్రిగోజిన్ తోపాటు మ‌రో 9 మంది మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ర‌ష్యా తిరుగుబాటు నేత ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మ‌ర‌ణించాడు. అయితే ఆ విమాన ఘ‌ట‌న‌కు చెందిన కొన్ని వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. గింగిరాలు తిరుగుతూ ఆ విమానం నేల‌కూలింది. ఆ త‌ర్వాత భారీ మంట‌లు వ్యాపించాయి. ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌నం ఇస్తున్నాయి.మాస్కో: రష్యా ప్రైవేటు సైన్యం వాగ్న‌ర్ మిలిట‌రీ కంపెనీకి చెందిన చీఫ్ ఎవ‌జెనీ ప్రిగోజిన్ప్రయాణిస్తున్న నేల‌కూలిన విష‌యం తెలిసిందే. ఆ ప్ర‌మాదంలో ప్రిగోజిన్‌తో పాటు మ‌రో 9 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ర‌ష్యాలోని తేవ‌ర్ ప్రాంతంలో ఆ విమానం కూలింది. మాస్కో నుంచి సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్ ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. కేవ‌లం 30 సెక‌న్ల‌లో ఆ విమానం 8 వేల ఫీట్ల కింద‌కు ప‌డిపోయింది. ఆ విమానంలో ముగ్గురు సిబ్బంది, ఏడు మంది ప్యాసింజెర్లు ఉన్నారు. అంద‌రూ మృతిచెందిన‌ట్లు టాస్ ఏజెన్సీ తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.