బీజేపికిపార్టీ సీనియర్ నేత మామిడి భీంరెడ్డి రాజీనామా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోని పెంజర్ల గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మామిడి భీంరెడ్డి బిజేపి పార్టీకి రాజీనామా చేశారు. మామిడి భీంరెడ్డి పార్టీకి విధేయుడుగా గత 40 ఏళ్ళుగా సేవలు అందిస్తూ వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే ఆయనకు ఎనలేని అభిమానం. కొత్తూరు మండల జడ్పిటిసిగా భారతీయ జనతా పార్టీ నుండి ఆయన రెండు పర్యాయాలు పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు గత 40 ఏళ్లలో ఆయన అనేక కార్యక్రమాలను నిర్వహించారు. పార్టీ పటిష్టత కోసం పార్టీ అభివృద్ధి కోసం ఆయన ఒకప్పుడు కంకణ బద్ధులై ఉండేవారు. రాష్ట్రస్థాయి పరిచయాల నుండి జాతీయస్థాయిలో కూడా ఆయనకు అనేక గుర్తింపు ఉండేది.

Leave A Reply

Your email address will not be published.