ప్రొఫెసర్‌ సాయిబాబా రిలీజ్‌పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జీఎన్ సాయిబాబా రిలీజ్‌పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. మావోలతో సంబంధాలు కలిగి ఉన్న కేసులో అరెస్టు అయిన సాయిబాబాను రిలీజ్‌ చేయాలని శుక్రవారం బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ప్రొఫెసర్‌ సాయిబాబాతో పాటు ఇతర వ్యక్తుల రిలీజ్‌ను సుప్రీం నిలిపివేసింది.హైకోర్టు తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేసింది. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది. డిసెంబర్‌ 8వ తేదీన మళ్లీ విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం తెలిపింది. జస్టిస్‌ ఎంఆర్ షాబెలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. మావోలతో లింకున్న కేసులో సాయిబాబా నిర్దోషి అని నాగపూర్‌ బెంచ్‌ తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును క్రిమినల్‌ ప్రొసిజర్‌లోని 390 కోడ్‌ ప్రకారం వ్యతిరేకిస్తున్నట్లు సుప్రీం బెంచ్‌ తెలిపింది.మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అభియోగాలతో 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు సాయిబాబాను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. అత్యంత కఠినమైన యూఏపీఏ చట్టం కింద సాయిబాబాపై అభియోగాలు మోపటంతో ఆయనకు ట్రయల్‌ కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించింది. దీనిని హైకోర్టులో సాయిబాబా సవాల్‌ చేశారు. పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ రోహిత్‌ దేవ్‌జస్టిస్‌ అనిల్‌ పన్సారేతో కూడిన నాగపూర్‌ బెంచ్‌జీవిత ఖైదు శిక్షను రద్దుచేస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.