మండల్ నివేదికను తుంగలో తొక్కుతున్న పాలకులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సామజిక న్యాయ పరిరక్షకుడు, భారత దేశ ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు, మండల్ నివేదిక రూపశిల్పి బిందేశ్వరి ప్రసాద్ మండల్ 105వ జయంతిని పురస్కరించుకొని  సిగ్నల్ గడ్డ పూలే, జడ్చర్ల అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఘనంగా నివాళ్ళు అర్పించ్చారు . ఈ సందర్బంగా  బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ బీహార్ మాజీ ముఖ్యమంత్రి మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు, న్యాయవాది,బీసీల ఆరాధ్య దైవంరెండవమండల్ కమిషన్ చైర్మన్ రెండుసంవత్సరాలు దేశవ్యాప్తంగాసంపూర్ణంగా అధ్యయనం చేసి వెనకబడ్డ కులాల స్థితిగతులను40 ప్రతిపాదనలతో కూడినటువంటి నివేదికను 1980 డిసెంబర్ లో రాష్ట్రపతికి అందజేశారన్నారు.1990వ సంవత్సరం ఆగష్టు 7వ తేది రోజు ఆనాటి ప్రధానమంత్రి విశ్వనాధ్ ప్రతాప్ సింగ్  సమక్షంలో పార్లమెంట్ లో మండల్ నివేదిక లోని ఒక ప్రతిపాదనను పార్లమెంట్లో  ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని  ప్రకటించగానే ఆధిపత్య కుల పార్టీలను వ్యతిరేకించాయని మూడు సంవత్సరాల పోరాటం తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 27% రిజర్వేషన్ అమలవుతున్నాయని ఆచరణలో 10శాతం కూడా అమలు కావడం  లేదని తెలిపారు. వాటి నుండి నేటి వరకు దేశాన్ని పాలించిన పార్టీలన్నీ  మండల్ నివేదికను అటకెక్కించి ప్రభుత్వ రంగ సంస్థలలో బీసీలకు వాటా ఇవ్వకుండా అణచివేస్తున్నారని మండిపడ్డారు. దేశ జనాభా గణన లో బీసీ కులాల గణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం బీసీలకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలలో సమానవాట కల్పించాలని  బిందెశ్వరి ప్రసాద్ మండల్ సూచించారని, పాలకులు పట్టించుకోకుండా బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని, మండల్ నివేదికను  అమలుపరిచేలా  కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత బీసీ శ్రేణులతో పాటు ప్రజా ప్రతినిధులపై కూడా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నడిమింటి శ్రీనివాస్,వడ్లని శేఖర్ యాదవ్,,జ హంగీర్ పాషా ,తెలుగు సత్యయ్య, గోపాల్, సురభి విజయ్ కుమార్,మాచారం శ్రీనివాస్, లింగం పేట్ శేఖర్,బొల్లెమోని నిరంజన్,జక్కా చంద్ర మోహన్ నర్సిములు, శ్రీనివాస్ యాదవ్ , గువ్వల లక్ష్మణ్, మాచారం కృష్ణయ్య, మాసయ్య,అమృత్ విజయ్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.