జాతీయ రికార్డు నెలకొల్పిన పారుల్‌ చౌధరి

.. పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హంగేరి బుడాపెస్ట్‌లో జరుగుతన్న ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌-2023లో మహిళల 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌ ఫైనల్‌లో భారత అథ్లెట్‌ పారుల్‌ చౌధరీ 11వ స్థానంలో నిలిచింది. 9 నిమిషాల 15.31 సెకన్లలో గమ్యానికి చేరిన పారుల్‌ జాతీయ రికార్డు నెలకొల్పి.. 2024 పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన హీట్స్‌లో ఐదోస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన పారుల్‌.. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో 11వ స్థానంలో నిలిచింది. 2,900 మీటర్ల స్ప్లిట్‌ వరకు 13వ స్థానంలో ఉన్న పారుల్‌.. చివరి వంద మీటర్ల స్ప్లిట్‌లో రెండుస్థానాలను మెరుగుపరుచుకొని 11వ స్థానంలో నిలిచింది.మరో వైపు పురుషుల 400 మీటర్ల రిలే ఫైనల్లో అనస్‌ యాహియా, అమోజ్‌ జేకబ్, అజ్మల్, రాజేశ్‌ రమేశ్‌లతో కూడిన భారత బృందం ఐదో స్థానాన్ని దక్కించుకుంది. భారత బృందం 2 నిమిషాల 59.92 సెకన్లలో గమ్యానికి చేరింది. ఇదిలా ఉండగా.. ప్రపంచ అథ్లెటిక్స్‌లో రాణించిన క్రీడాకారులను ప్రధాని మోదీ అభినందించారు. 400 మీటర్ల రిలే రేస్‌ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ప్రధాని.. 4×400 మీటర్ల రిలేలో అనాస్‌, అమోజ్‌, రాజేశ్‌ రమేశ్‌, మొమ్మద్‌ అజ్మల్‌ రికార్డు సృష్టించి ఫైనల్స్‌లోకి ప్రవేశించారని, ఇది గుర్తుండి పోతుందన్నారు. భారతీయ అథ్లెటిక్స్‌కు నిజంగా చారిత్మాత్మకమైన పునరాగమనం’గా పేర్కొంటూ పోస్ట్‌ పెట్టారు.

Leave A Reply

Your email address will not be published.