చేతివృత్తులకు వరం పిఎం విశ్వకర్మ కౌశల్ యోజన

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశంలో 80 కులాలకు సంబంధించినటువంటి చేతివృత్తుల్లో ఉన్న వివిధ కళాకారుల జీవితాల్లో మార్పుల కోసం అభివృద్ధి కోసం మారిన టెక్నాలజీని అందిపుచ్చుకోవడం కోసం మార్కెటింగ్ కోసం ఏ ప్రభుత్వము చేయనటువంటి గొప్ప ప్రణాళిక సామాన్యుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసారని బిజెపి జాతీయ ఓబీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జి పెరికే సురేష్ మన్నారు.విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17 వ తారీకు నుంచి దేశంలో 30 లక్షల కుటుంబాలకి అందించడానికి ఈ ఫతకం సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం 13వేల కోట్ల రూపాయలతో స్వతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట లోను ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం విశ్వకర్మ కౌసల్య యోజన పథకాన్ని మంత్రివర్గ ఆమోదం తరువాత విధివిధానాలతో ప్రారంభించడం అభినందనీయమని అన్నారు.దీనిని అన్ని వర్గాలకు అందే విధంగా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కృషి చేయాలని పెరికే సురేష్ అన్నారు.ఈరోజు విశాఖపట్నం విచ్చేసిన ఆయనకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జ్ కర్రీ వేణుమాధవ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అచ్చి చిన్నబాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేతివృత్తులు వారి కోసం పీఎం విశ్వకర్మ కౌశల్య యోజన రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ముందడుగు వేసి చేతివృత్తుల వారికి ఆధునికరణ పరికరాల్లో శిక్షణ ఇచ్చి వాటిని అందించే విధంగా చేతివృత్తులకు అభివృద్ధికి బాటలు వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు.

 

 

Leave A Reply

Your email address will not be published.