రేరా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రేరా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలను నియంత్రించాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డా పల్లెపాడు దామోదర్ కోరారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని రేరా రాష్ట్ర కార్యాలయంలో రేరా చైర్మన్ డా. యన్. సత్యనారాయణ వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సిసిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, ఏఐసిడబ్లుసి ఉపాధ్యక్షుడు డా. యం. భీం రెడ్డి, సౌత్ రాష్ట్రాల కో- కన్వీనర్ డా. హరిప్రియ లు నేటి కార్యక్రమం పాల్గొన్నారు. తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి మరియు వరంగల్ జిల్లాలు, పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ వ్యాపార ప్రకటనలతో, నిర్మాణాలు పూర్తి కాకున్నా, తప్పుడు వాగ్దానాలతో, అడ్వాన్స్ బుకింగ్ లతో పెద్ద మొత్తంలో డబ్బులను వసూలు చేస్తూ, అనుచిత వ్యాపార విధానాలను అవలంభిస్తున్నారని రేరా చైర్మన్ కు విన్నవించడం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 20 నుండి 50 అంతస్తుల కు పైగా నిర్మాణాలలో కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం వినియోగదారుల ప్రతినిధులు రేరా చైర్మన్ సత్యన్నారాయణ కు తెలిపారు. కాబట్టి వినియోగదారుల్లో రేరా చట్టం 2016 తో పాటు నేషనల్ బిల్డింగ్ కోడ్ 2005, బిల్డింగ్ రూల్స్ 2012, తెలంగాణా మునిసిపాలీటీల చట్టం 2019, వినియోగదారుల రక్షణ చట్టం 2019 అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్స్ నిబంధనలు పై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని రేరా చైర్మన్ ను క్లోరారు.

Leave A Reply

Your email address will not be published.