చైనా కొత్త మ్యాప్ విడుదల పై భారత్ కు మద్దతు పలికిన నాలుగు దేశాలు

ఇటీవ‌ల చైనా రిలీజ్ చేసిన కొత్త మ్యాప్‌ పై నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్న విష‌యం తెలిసిందే. భార‌త్‌లోని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ల‌డాఖ్ ప్రాంతాల‌ను త‌మ దేశంలోనే ఉన్న‌ట్లు చైనా త‌న మ్యాప్‌లో చూపించింది. దీంతో పాటు మ‌రికొన్ని దేశాల భాగాల‌ను త‌మ భూభాగంగా చిత్రీక‌రించింది. ద‌క్షిణ చైనా స‌ముద్ర భూభాగాన్ని కూడా చైనా త‌మ మ్యాప్‌లో పొందుప‌రిచింది. దీన్ని వియ‌త్నాం ఖండించింది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేసింది. ద‌క్షిణ చైనా స‌ముద్ర ప్రాంతంలో చైనా విస్త‌ర‌ణను గుర్తించ‌డం లేద‌ని పిలిప్పీన్స్ తెలిపింది. మ‌లేషియా స‌ర్కార్ కూడా చైనా విస్త‌ర‌ణ కాంక్ష‌ను తీవ్రంగా వ్య‌తిరేకించింది. ద‌క్షిణ చైనా స‌ముద్ర ప్రాంతంలో 80 శాతం త‌మ‌దే అని చైనా త‌న కొత్త మ్యాప్‌లో పేర్కొన్న‌ది. 1947 మ్యాప్‌తో పోలుస్తూ చైనా కొత్త మ్యాప్‌ను రిలీజ్ చేసింది. సుమారు 1800 కిలోమీట‌ర్ల దూరం త‌మదే అన్న‌ట్లుగా చైనా త‌న మ్యాప్‌లో చూపించుకున్న‌ది. ఆ ప్రాంతంలో త‌మ జ‌లాలు కూడా ఉన్న‌ట్లు పిలిప్పీన్స్‌బ్రూనైమలేషియాతైవాన్ దేశాలు పేర్కొంటున్నాయి.

Leave A Reply

Your email address will not be published.