వికారాబాద్ జిల్లాలో దంచి కొడుతున్న వానలు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్/నవాబుపేట ప్రతినిధి: వికారాబాద్ జిల్లా(నవాబుపేట) ఈ రోజు తెల్లవారుజామున నుంచి కుండపోత వర్షం కురుస్తుంది,ఉరుముల,మెరుపులతో అతి భారీ వర్షం కురుస్తుంది. నెల రోజుల నుండి వర్షం పడక రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నా సమయంలో వరుణుడు కరుణించి వర్షం కురిపిస్తుండడంతో అన్నదాతల ముఖాలలో ఆనందాలు వేలు వేరుస్తున్నాయి. మరోవైపు శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న ప్రజలు కురుస్తున్న ఈ భారీ వర్షానికి ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందోనని మీకు బిక్కుమంటూ గడుపుతున్నారు.  భారీ వర్షాల కారణంగా ఈపాటికి పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకున్న జలాశయాలు చెరువులు ఈ వర్షంతో ఎలాంటి ప్రమాద సంఘటన వినవలసి వస్తుందోనని అటు అధికారులు ఇటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.