బైరపూర్ నుండి రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం

.. పోచారం ఆదేశాల మేరకు నిర్మాణానికి ముందుకు వచ్చిన ద్రోణవల్లి సతీష్

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గూడు లేని నిరుపేదలకు రెండు పడకగదుల ఇండ్లు నిర్మించి వారి సొంతింటి కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో డబుల్ బెడ్ రూమ్ పథకానికి శ్రీకారం చుట్టారు. బాన్సువాడ నియోజకవర్గం లో రెండు పడక గదుల నిర్మాణాల కోసం ప్రభుత్వం మూడుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఆరు నెలల పాటు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి, ప్రస్తుత శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నియోజకవర్గమైన బాన్సువాడలో తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలను చేపట్టాలని ఆలోచించి ఆచరణలో పెట్టారు. ఆయన కుడి భుజం అయిన కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన మాజీ జడ్పిటిసి సభ్యులు ద్రోణవల్లి సతీష్ కు రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలను చేపట్టాలని పిలుపునివ్వగా తన రాజకీయ గురువు అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపుమేరకు లాభాలు నష్టాలు అని చూడకుండా తన గ్రామ పంచాయతీ పరిధిలోని భైరాపూర్ గ్రామంలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణానికి 2017లో 25 ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఏడాది కాలంలోనే 25 రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేసి తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలను చేపట్టిన గ్రామంగా బైరాపూర్ చరిత్ర కెక్కింది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని బాన్సువాడ నియోజకవర్గంలో ప్రస్తుతం పదివేల ఇండ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 7 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టి పేదోడికి పంపిణీ చేసి సొంత ఇంటి కలలను నెరవేర్చిన ఘనత శాసనసభాపతికి దక్కింది. బాన్సువాడ నియోజకవర్గం సీనియర్ నాయకులు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి 30 ఏళ్లుగా కుడి భుజంగా ఉంటూ ఎలాంటి పదవులను ఆశించకుండా అభివృద్ధి ధ్యేయంగా ద్రోణవల్లి సతీష్ బీర్కూరు మండలంలో అడుగులు వేస్తున్నారు. గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే మరుగుదొడ్లు అత్యవసరం అని గుర్తించి ప్రజలను చైతన్యపరిచి ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఇంటికి మరుగు దొడ్డి ఉండేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ప్రతి ఇంటికి ఉపాధి మార్గం చూపెట్టడానికి ముద్ర రుణాలను బ్యాంకు అధికారులతో మాట్లాడి మల్లాపూర్ గ్రామస్తులకు కోటి రూపాయలు రుణాలు అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 25 ఇండ్లు నిర్మాణం చేపట్టిన ద్రోణవల్లి సతీష్ గ్రామంలో మరికొంతమంది ఇండ్లు లేనివారు ఉండడంతో వారిని గుర్తించి వారికి కూడా సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ఈ విషయం సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మరో 150 ఇండ్లు మంజూరు చేయించుకుని బైరాపుర్ గ్రామంలో నిర్మాణాలను పూర్తిచేసి సభాపతి చేతుల మీదుగా బైరాపూర్ గ్రామస్తులకు పంపిణీ చేశారు. తెలంగాణలోనే మారుమూల గ్రామమైన బైరాపూర్ గ్రామంలో తన సూచనల మేరకు లాభనష్టాలు చూడకుండా ముందుకు వచ్చి రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలను నాణ్యతతో నిర్మించిన ద్రోణవల్లి సతీష్ కు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. ద్రోణవల్లి సతీష్ బాటలోనే మరికొంతమంది నాయకులు లాభనష్టాలకు ఆశించకుండా తన రాజకీయ గురువర్యులు రెండు పడకల ఇల్లు నిర్మించాలని ఆదేశించడంతో గురువు ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించి ఇల్లు నిర్మించి అందించడంతో స్పీకర్ మన్ననలు ద్రోణవల్లి సతీష్ పొందారు .దీంతో నియోజకవర్గంలో పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం అదే బాటలో కోటగిరి, వర్ని ,బాన్సువాడ నసురుల్లాబాద్ , రుద్రుర్,మండలాల్లో రెండు పడకల నిర్మాణానికి శ్రీకారం చుట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడకల ఇల్లు పథకానికి బాన్సువాడ నియోజకవర్గం ఆదర్శమని కూడా చెప్పుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.