ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్‌.. జీ20 ఇన్విటేష‌న్‌పై వివాదం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జీ20 దేశాల నేత‌ల‌కు విందు ఇవ్వ‌నున్న నేప‌థ్యంలో.. ఓ ఇన్విటేష‌న్ ప‌త్రిక‌పై కొత్త‌గా ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్అని రాశారు. రాష్ట్ర‌ప‌తి ముర్ము ఇచ్చే ఆ విందు ఆహ్వాన‌ కార్డులో.. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బ‌దులుగా .. ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ అని రాయ‌డం వివాదాస్ప‌దం అవుతోంది. జీ20 మీటింగ్‌కు వివిధ దేశాధినేత‌లు హాజ‌రవుతున్న ఆ వేడుక స‌మ‌యంలో.. ఇండియాను భార‌త్‌గా గుర్తిస్తూ ఇన్విటేష‌న్‌ను ప్ర‌చురించ‌డం సంచ‌ల‌నంగా మారింది. జీ20 దేశాధినేత‌ల‌తో పాటు ముఖ్య‌మంత్రుల‌కు సెప్టెంబ‌ర్ 9వ తేదీన విందు ఇవ్వ‌నున్నారు.ఓ అధికారిక కార్య‌క్ర‌మానికి ఇన్విటేష‌న్‌పై ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ అని రాయ‌డం ఇదే తొలిసారి అని అధికారులు చెబుత‌న్నారు. భార‌త్ అన్న ప‌దం మ‌న రాజ్యాంగంలో ఉంద‌ని అధికారులు తెలిపారు. ఇండియా లేదా భార‌త్‌ఆర్టిక‌ల్ 1 ప్ర‌కారం యూనియ‌న్ ఆఫ్ స్టేట్స్‌గా గుర్తిస్తారు. విదేశీ ప్ర‌తినిధుల‌కు అంద‌జేసిన జీ20 బుక్‌లెట్‌లోనూ భార‌త్ అన్న ప‌దాన్ని వాడారు. ప్ర‌జాస్వామ్యానికి భార‌త్‌ త‌ల్లి లాంటిద‌నివేల ఏండ్ల నుంచి ఇక్క‌డ సుసంప‌న్న‌మైన ప్ర‌జాస్వామ్యం వ‌ర్ధిల్లితున్న‌ట్లు ఓ బుక్‌లెట్‌లో రాశారు.రాష్ట్ర‌ప‌తి డిన్న‌ర్ ఇన్విటేష‌న్ కార్డు లీకైన త‌ర్వాత‌.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ త‌న ట్వీట్‌లో హ‌ర్షం వ్య‌క్తం చేశారు. రిప‌బ్లిక్ ఆఫ్ భార‌త్ అని రాస్తూ.. మ‌న నాగ‌రిక‌త ముందుకు వెళ్ల‌డం గ‌ర్వంగా ఉంద‌ని అన్నారు. తాము అనుకున్నట్లే పేరు మార్చార‌ని కాంగ్రెస్ నేత జ‌య‌రాం ర‌మేశ్ విమ‌ర్శించారు. ఇండియాను భార‌త్ అని పిలువాల‌ని కొన్ని రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ నేత మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ పిలుపునిచ్చారు. ఇటీవ‌ల విప‌క్ష పార్టీలు త‌మ కూట‌మికి ఇండియా అన్న పేరు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. అయితే అప్ప‌టి నుంచి ఇండియాభార‌త్ అంశంపై వివాదం చెల‌రేగుతూనే ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌న దేశానికి ఇండియా అన్న గుర్తింపు ఉంది. అయితే గ‌తంలో ఈ విశాల దేశాన్ని భార‌త్‌గా పిలిచేవారు.

Leave A Reply

Your email address will not be published.