ఫెవిపిరావిర్ వినియోగం తో నీలి రంగులోకి మారిన పసికందు కళ్లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కరోనా వైరస్‌కు చికిత్స తీసుకున్న ఓ పసికందు కళ్లు అసాధారణ రీతిలో ముదురు నీలి రంగులోకి మారాయి. ఈ ఘటన థాయ్‌లాండ్‌ లో వెలుగులోకి వచ్చింది. మెడికల్ జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ పీడియాట్రిక్స్ ప్రకారం..ఆరు నెలల పసికందుకు జ్వరందగ్గు రావడంతో తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. దీంతో ఆ చిన్నారికి కొవిడ్‌ టెస్ట్‌ చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో పసికందుకు మూడు రోజుల పాటు ఫెవిపిరావిర్‌తో  చికిత్స అందించారు. ఆ ఔషధం వాడిన తర్వాత చిన్నారి ఆరోగ్యం మెరుగైంది. అయితేఆ మందు వాడిన 18 గంటల తర్వాత చిన్నారి కళ్ల రంగులో మార్పు కనిపించింది. చిన్నారి కళ్లు ముదురు గోధుమ రంగు నుంచి ప్రకాశవంతమైన నీలి రంగులోకి మారాయి. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు వెంటనే వైద్యులను సంప్రదించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఫెవిపిరావిర్‌ మందు వినియోగం తక్షణమే నిలిపివేయమని సూచించారు. ఆ తర్వాత ఐదు రోజులకు పసికందు కళ్లు సాధారణ స్థితికి చేరుకున్నాయి.కళ్లు మినహా చర్మంగోళ్లునోరుముక్కు వంటి ప్రాంతాల్లో ఎటువంటి రంగు మార్పు కనిపించలేదు. ఫెవిపిరావిర్ వినియోగం మొదలెట్టిన మూడో రోజుకు శిశువు ఆరోగ్యం మెరుగుపడింది. అయితేకళ్ల రంగు మార్పు కారణంగా ఆ మందు వాడొద్దని వైద్యులు సూచించారు. మందు నిలిపివేసిన ఐదో రోజుకు కళ్లు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి’ అని జర్నల్‌లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.కాగాచిన్నారులకు కొవిడ్ ట్రీట్‌మెంట్‌గా ఫెవిపిరావిర్‌ను థాయ్‌ల్యాండ్ ప్రభుత్వం 2022లో అనుమతించింది. ఓ మోస్తరు వ్యాధి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు వాడాలని సూచించింది.

Leave A Reply

Your email address will not be published.