హరిహర క్షేత్రంలో శ్రీకృష్ణ అష్టమి వేడుకలు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్:  వికారాబాద్ జిల్లా, మోమిన్ పెట్ మండలం , అమ్రోధికలాన్ గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి హరిహర క్షేత్రం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా సుదర్శన హోమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీ వేణుగోపాల స్వామి హరి హర క్షేత్రం బృందం పిలుపుమేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ శ్రీ వేణుగోపాల స్వామి హరిహర క్షేత్రం వారు నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలో మరియు సుదర్శన హోమంలో పాల్గొని వేణుగోపాల స్వామి హరిహర క్షేత్రంని దర్శించుకున్నారు. తదనంతరం సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయాలు ప్రాప్తిస్తాయని ఆ దేవదేవుని యొక్క దయా, కరుణ, అనుగ్రహం ఉంటే మనం చేసే ప్రతి పనిలో విజయం ప్రాప్తిస్తుందని అనాదికాలం నుండి వస్తున్న మన సాంస్కృతిక చరిత్ర తెలియజేస్తుందని పిలుపునిచ్చారు. మనం చేసే ప్రతి పనిలో ధర్మం ఉంటే ఆ ధర్మం వెంట నేనున్నానని ధైర్యాన్నిస్తూ, శక్తి సామర్థ్యాలనుస్తూ, జ్ఞానాన్నిస్తూ, సరైన మార్గాన్ని చూపిస్తూ విజయానికి, ధర్మకార్యాన్ని గెలిపించడానికి నాంది పలికే దైవం శ్రీకృష్ణుడని శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పులి సంఘప్ప గౌడ్, కరాటే మాస్టర్ అశోక్, పిరమిడ్ మాస్టర్ రాఘవరెడ్డి, శ్రీ వేణుగోపాల స్వామి హరి హర క్షేత్రం భక్త బృందం అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.