ఈటెలపై పోటీకి దిగనున్న టిఆర్ఎస్ అభ్యర్థి ఇతనే

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి ఎంపిక దాదాపుగా ఖాయం అని ప్రచారం జరిగినా.. చివరి నిమిషం వరకు మరొకరు ఎవరైనా రంగంలోకి వస్తారా అనే సస్పెన్స్ కొనసాగింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు కౌశిక్ రెడ్డికి టికెట్ రావడం లేదని, అధిష్టానం పక్కకు పెట్టిందని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డి మాత్రం టికెట్ తనకే వస్తుందని నమ్మకంగా చెపుతున్నారు. అనుకున్నట్లే టికెట్ లభించినా.. ప్రత్యర్థి ఈటలను ఈ సారి ఎలాగైనా ఓడించాలని.. అమలుచేస్తున్న కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా అనే సందేహం కలుగుతుంది. హుజురాబాద్ నియోజవర్గంలో మంచి పట్టున్న ఈటలను ఢీ కొట్టాలంటే ఈ సారి కౌశిక్ పకడ్బంది ప్రణాళిక వేయాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెళ్లు శ్రీనివాస్ యాదవ్ ను పెట్టి హరీష్ రావు, గంగుల హుజూరాబాద్ లో మకాం వేసి పోరాడినా ఫలితం లేకుండా పోయింది.

Leave A Reply

Your email address will not be published.