జాతీయ బి.సి మహిళా సంఘం జాతీయ కన్వీనర్ గా రమాదేవి  

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జాతీయ బి.సి మహిళా సంఘం జాతీయ మహిళా కన్వీనర్ గా రమాదేవి  నియమితులైనారు. ఈ మేరకు జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య చేతుల మీదగా నియామకపత్రం అందుకున్నారు.ఈ సందర్బంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ రాజకీయంగా బిసి మహిళలు ముందుకు వచ్చినపుడే దేశం మరింత ముదుకు వెల్లగలదన్నారు.మహిళలకు రాజకీయంగా అతి తక్కువ ప్రాతినిధ్యం యుందని  కావున మహిళలకు రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్  చేసారు.బిసి మహిళలకు ఇంకా తక్కువ ప్రాతినిధ్యం ఉంది కదా వారికి సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేసారు.అంతేకాదు బీసీల జనరల్ – పురుషుల ప్రాతినిధ్యం కూడా ఇంకా తక్కువ ఉంది. 75 సంవత్సరాల తర్వాత బీసీల వాటా బీసీలకు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజస్వామ్యదేశం అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి, వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి. అప్పుడు దేశంలో సమైక్యత, సమగ్రత, శాంతి ఉంటుంది. అందుకోసం బి.సి లకు రావలసిన వాటా కోసం మరోసారి అధ్యయనం జరుగాలన్నారు. అనంతరం రమాదేవి మాట్లాడుతూ  బిసి మహిళల హక్కుల పరిరక్షనకు తనవంతు కృషి చేస్తామన్నారు.రానున్న పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు పెట్టాలని, అందులో బిసి సబ్ కోట కల్పించాలని డిమాండ్ చేసారు.రమాదేవి బిసి మహిళా సంఘం మహిళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా 12 సంవత్సరాలపాటు సేవలు అందించారు.రమాదేవి వేవాలను గుర్తించిన జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆమెను జాతీయ బి.సి మహిళా సంఘం జాతీయ మహిళా కన్వీనర్ గా నియమించారు.ఈ కార్యక్రమం లో బి.సి మహిళా సంఘం జాతీయ మహిళా అద్యక్షురాలు పద్మలత,బిసి మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు ఏ.పుష్పలతా, బి.సి మహిళా సంఘం తెలంగాణా రాష్ట్ర ప్రదాన కార్యదర్షులు కటుకురి లక్ష్మి, నల్ల మంజులత,నిర్మల ముదిరాజ్, బి.సి మహిళా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కే.శుబాషిని, బల్ల గీత,నల్లమేకల విజయ,వాణి రెడ్డి, లక్ష్మితదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.