దీపావళి పండగకు పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. మీ అకౌంట్లోకి రూ.81 వేలు జమ!

ఉద్యోగులకు ముఖ్యమైనది పీఎఫ్‌. ఈ పీఎఫ్‌ అమౌంట్‌ వారి భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడే డబ్బు. ఉద్యోగ విరమణ తర్వాత ఈ పీఎఫ్‌ డబ్బు ప్రయోజనం చేకూర్చనుంది. ఈ దీపావళి పండగకు పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌ అందనుంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కు చెందిన 7 కోట్ల మంది చందాదారులకు ఈ నెలాఖరు నాటికి గుడ్‌న్యూస్‌ రాబోతోంది.2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వం ఈపీఎఫ్ ఖాతాదారుల ఖాతాకు బదిలీ చేయబోతోంది. ఈసారి 8.1 శాతం వడ్డీ లభిస్తుందని తెలుస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2022 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ ఖాతాలో వచ్చిన వడ్డీని లెక్కించింది.

గతేడాది వడ్డీ కోసం 6 నుంచి 8 నెలల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. కానీ, గతేడాది కోవిడ్ కారణంగా వాతావరణం భిన్నంగా మారింది. ఈ ఏడాది ప్రభుత్వం జాప్యం చేయదు. వడ్డీ డబ్బును ఈ నెలాఖరులోగా ఖాతాదారుల అకౌంట్‌కు బదిలీ చేయవచ్చు. ఈ ఏడాది వడ్డీ 40 ఏళ్ల కనిష్ఠ స్థాయిలో ఉంది.

ఎవరికి ఎంత వడ్డీ వస్తుంది..?

☛ మీ పీఎఫ్ ఖాతాలో రూ. 10 లక్షలు ఉంటే మీకు రూ. 81,000 వడ్డీ లభిస్తుంది.

☛ మీ పీఎఫ్ ఖాతాలో రూ.7 లక్షలు ఉంటే మీకు వడ్డీ కింద రూ.56,700 లభిస్తుంది.

☛ మీ పీఎఫ్ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే రూ.40,500 వడ్డీ వస్తుంది.

☛ మీ ఖాతాలో లక్ష రూపాయలు ఉంటే 8,100 రూపాయలు వస్తాయి.

మిస్డ్ కాల్ నుండి బ్యాలెన్స్ తెలుసుకోండి

☛ మీ పీఎఫ్‌ డబ్బును చెక్ చేయడానికి మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. దీని తర్వాత, మీరు ఈపీఎఫ్‌వో​సందేశం ద్వారా పీఎఫ్‌ వివరాలను పొందుతారు. ఇక్కడ కూడా మీ యూఏఎన్‌, పాన్‌, ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి.

ఆన్‌లైన్‌లో..

☛ ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి మీరు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి, epfindia.gov.inలో ఇ-పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి.

Leave A Reply

Your email address will not be published.