75 కోట్ల మంది బీసీల అభివృద్ధికి కేంద్రం ఏం చేస్తోంది?..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 75 కోట్ల మంది బీసీల అభివృద్ధికి కేంద్రం ఏం చేస్తోందని రాజ్య సభ సబ్యులు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు ఆర్. కృష్ణయ్య ప్రశ్నించారు.బుదవారం ఆర్. కృష్ణయ్య 67 జన్మదిన వేడుకలు బిసి భవన్ లో ఘనంగా జరిగాయి.ఈ వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా 74 బీసీ కుల సంఘాలు, 16 బీసీ సంఘాలు, 26 బిసి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరై పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ బిసిలకోసం తనపోరాయ్తం ఆగదని,పార్లమెంట్ లో బిసి బిల్లు పెట్టేవరకు నిరంతర పోరాట చేస్తనని అన్నారు.తనపోరాటానికి యావత్ బిసి సమాజం అండగా ఉంటుందన్న ఆశబావాన్ని వ్యక్తం చేసారు.ఈ సందర్బంగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు గుజ్జ సత్యం  కృష్ణయ్య కు శాలువా,పూలమాలతో ఘనంగా సన్మానించి జ్ఞ్యపికను అందజేసారు. అనంతరం గుజ్జ సత్యం  మాట్లాడుతూ.. 75 కోట్ల మంది బీసీలు అభివృద్ధికి కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. రెండు లక్షల కోట్లు బడ్జెట్ బీసీలకు ఇవ్వకపోతే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ధర్నాలు చేస్తామన్నారు. 75 ఏళ్ళుగా భారతదేశంలో అన్ని పదవులు, సంక్షేమ పథకాలు తమరే అనుభవించారని.. బీసీలకు మాత్రం ఏం దక్కడం లేదని విమర్శించారు. బీసీ సంఘాలన్నీ కలిసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీసీలను ఏకం చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో లాల్ కృష్ణ,బాలయ్య, నెల వెంకటేష్,రందావ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.