విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థిక పారిశ్రామిక రంగాలలో బీసీలకు సమాన వాట      

- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్  

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాలలో  ప్రజా బలం కలిగిన బీసీ నాయకులను పక్కకు నెట్టి  అగ్రకుల నాయకులకు పెట్టుబడిదారులకు అడిగే పార్టీలో టికెట్లు కేటాయిస్తున్నాయని నియోజకవర్గంలో  60 శాతంకు పైగా బీసీలు ఉన్నారని సామాజిక న్యాయస్ఫూర్తితో జనాభా దామాషా ప్రకారం  పాలనలో వాటా కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.  బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణం లోని లయన్స్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య  మాట్లాడుతూఇది ప్రజాస్వామ్య దేశమని జనాభా దామాషా ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థిక పారిశ్రామిక రంగాలలో  బీసీలకు సమాన వాట చెందాలని లేనియెడల వచ్చే ఎన్నికలలో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు..  ఏడు శాతం ఉన్న అగ్రకులాల వాళ్ళు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో  90 శాతం  వాటా పొందుతున్నారని, 93 శాతం ఉన్న బహుజనులు  అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 18 జిల్లాల నుండి  ఈ సామాజిక వర్గానికి చెందిన ఒక శాసనసభ్యుడు కూడా లేడని ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి  గొడ్డలి పెట్టని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అన్ని జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని అన్నారు.కాంగ్రెస్,, బిజెపి, బి ఆర్ఎస్, పార్టీలు  వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో  బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశం లో బీసీసేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణయాదవ్, బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర అధ్యక్షులు,ఎర్ర సత్య నారాయణ, విద్యార్థి సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శివేముల రామకృష్ణ, బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కృష్ణుడు,జహంగీర్ పాషా నిరంజన్,సురభి విజయ్ కుమార్, గోపాల్, రామస్వామి, గౌరీ శంకర్,కట్ట మురళి సురభి రఘు, నెక్కొండ చారి, శివరాములు,ఆలూర్ నర్సిములు, శ్రీనివాస్, వెంకటేష్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.