మరింత పారదర్శకంగా న్యాయమూర్తుల నియామక ప్రక్రియ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: న్యాయ‌మూర్తుల నియామ‌క ప్ర‌క్రియ మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా ఉండాల‌ని భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ శుక్ర‌వారం పేర్కొన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల నియామ‌కానికి సంబంధించి నిర్దేశిత ప్ర‌మాణాలను రూపొందిస్తామ‌ని చెప్పారు. నియామ‌కాల‌కు అర్హులైన దేశంలోనే అత్యున్న‌త న్యాయ‌మూర్తుల‌ను మ‌దింపు చేసేందుకు విస్తృత ప్రాతిప‌దిక‌న సెంట‌ర్ ఫ‌ర్ ప్లానింగ్ అండ్ రీసెర్చి క‌స‌ర‌త్తు సాగిస్తోంద‌ని సీజేఐ తెలిపారు. న్యాయ‌మూర్తులు, వారిచ్చిన తీర్పుల‌పై అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ఈ మ‌దింపు చేప‌డ‌తార‌ని ఆయ‌న పేర్కొన్నారు. దేశంలోని 50 మంది అత్యున్న‌త న్యాయ‌మూర్తుల‌ను స‌ర్వోన్న‌త న్యాయ‌స్ధానంలో నియమించేందుకు మ‌దింపు ప్ర్ర‌క్రియ సాగుతుంద‌ని అన్నారు. న్యాయ‌మూర్తులే న్యాయ‌మూర్తుల‌ను ఎంపిక చేస్తార‌ని, నాలుగు గోడ‌ల మ‌ధ్య ఈ తతంగం సాగుతోంద‌ని, సుప్రీంకోర్టు కొలీజియం వ్య‌వ‌స్ధ‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన సంగ‌తి తెలిసిందే.మూడు దశాబ్ధాల కొలీజియం వ్య‌వ‌స్ధ‌లో పార‌ద‌ర్శ‌క‌త లోపించింద‌ని, జ‌వాబుదారీత‌నం లేద‌నే అసంతృప్తి నెల‌కొంది. కాగా, ప్ర‌జాస్వామ్యంలో ఏ వ్య‌వ‌స్ధ నూరు శాతం స‌జావుగా ఉండ‌ద‌ని సీజేఐ డీవై చంద్రచూడ్ గ‌తంలో వ్యాఖ్యానించారు. కొలీజియం వ్య‌వ‌స్ధ‌పై స్పందిస్తూ ప్ర‌స్తుత వ్య‌వ‌స్ధ‌లోనే మ‌న‌దైన ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నించాల‌ని చెప్పుకొచ్చారు.

 

 

Leave A Reply

Your email address will not be published.