ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తతగా ఉండాలి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: అప్రమత్తతతో అనారోగ్యానికి స్వస్తిఫలకాలని, ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి పేర్కొన్నారు. నేడు మోమిన్ కలాం యoదు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి చౌదరి మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ పై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వాతావరణ కాలుష్యంతో రోగాల వ్యాప్తి పెరుగుతుందని , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని నియంత్రించవచ్చని అన్నారు. ఇంటి పరిసరాలలో చెత్తాచెదారాన్ని పడేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వైరల్ వ్యాధులతో సతమతమయ్యేవారు తక్షణమే వైద్య సహాయం పొందాలని ఆయన సూచించారు. ఇంట్లో ఈగలు, దోమల వ్యాప్తి తో ప్రాణాంతక రోగాలు ప్రబలే అవకాశం ఉందని, డయాబెటిస్, కీళ్ల నొప్పులు, క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులకు చెక్కు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ వైద్యుల సలహాలు పాటించాలని జిల్లా సొసైటీ గౌరవ చైర్మన్ సాయి చౌదరి సూచించారు. ఈ కార్యక్రమం నకు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ గౌడ్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.