ఇప్పటివరకు దోరలకు మొక్కారు ఇకనుండి దొరసానులకు మొక్కండి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటివరకు దొర్లకు మొక్కారు ఇకనుంచి దొరసానులలో కూడా మొక్కండి అని చెప్పకనే చెప్పినట్టు ఉంది అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ అన్నారు. ఖమ్మం నగరంలోని మమత రోడ్డు లకారం ట్యాంక్బండ్ వద్ద ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా కార్యాలయంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నలమాస సుగుణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర జనాభాలో 56% ఉన్నటువంటి బీసీలకు కనీసం మహిళా బిల్లులో కూడా మహిళల వాటాగా ఓబీసీలకు అవకాశం కల్పించకపోవడం చాలా దారుణమైన విషయమని ఇది బీసీ సమాజాన్ని ఘోరంగా అవమానించడమేనని వ్యాఖ్యానించారు.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి మాట్లాడుతూ. బీసీలను శాశ్వతంగా జండాల మోసే కార్యకర్తల గాని పార్టీలు చూస్తున్నాయని చెప్పటానికి ఇది మరో ఉదాహరణ అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే ఐడియాలజీ సొసైటీ అధ్యక్షులు పెల్లూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ 2024 జరిగే ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలయ్యాల బీసీ జనగణన కూడా చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారపు నాగ రామాచారి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యామా రవి మరీదు శీను బలుసుపాటి దను తోపాటుగా వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.