జిల్లాలో 30, 30(A) యాక్టు అమలు
కామారెడ్డి జిల్లాలో శనివారం 30, 30(A) యాక్టు అమలు కామారెడ్డి జిల్లాలో 30, 30(A) యాక్ట్ అమలులో ఉందని ఎస్పీ బి. శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో సభలు, సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తే ముందుగా పోలీసుల అనుమతులు తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి 31 వరకు ఈ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు.