కూలి అవతారమెత్తిన ఎంపీ రాహుల్ గాంధీ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: భారత్‌ జోడో యాత్ర’ తర్వాత కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రాహుల్‌ తాజాగా కూలీ అవతారమెత్తారు. ఎర్రచొక్క ధరించి న్యూఢిల్లీ లోని ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌ లో కొద్దిసేపు కూలీగా పనిచేశారు. ఈ సందర్భంగా కూలీలతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడిన విషయం తెలిసిందే. అదే పంథాను ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇటీవలే ట్రక్కు డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు హర్యానాలో లారీ ఎక్కిన ఆయన వంద కిలోమీటర్ల వరకు అందులో ప్రయాణించారు. మధ్యలో ధాబాలో టీ తాగుతూ డ్రైవర్లతో మాట్లాడారు. అదేవిధంగా ఢిల్లీలోని బైక్‌ మెకానిక్‌ వర్క్‌షాపుకు వెళ్లి.. పానా పట్టి బైక్‌ను ఎలా రిపేర్‌ చేయాలో మెకానిక్‌లను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత హర్యానాలోని సోనీపట్ సమీపంలో ఉన్న మదీనా గ్రామ శివారుల్లోని పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులను కలిశారు. ప్యాంటును మోకాళ్లవరకు మడిచి పొలంలోకి దిగారు. అక్కడ వరినాటుతున్న రైతులతో ఆప్యాయంగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి వరి నాట్లు వేశారు. ట్రాక్టర్‌ ఎక్కి దుక్కిదున్నారు. ఆ తర్వాత ఢిల్లీ లోని ఆజాద్ పూర్ మండీ ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ కూరగాయలు, పండ్ల విక్రయదారులు, వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.