24 నుండి నిమ్స్ లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. ఈ నెల 24 నుంచి 30 వరకు నిమ్స్‌ మిలీనియం బ్లాక్‌లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్‌ బీరప్ప తెలిపారు. బ్రిటన్‌ డాక్టర్‌ రమణ దన్నపునేని ఆధ్వర్యంలో పది మంది వైద్య బృందంతో పాటు నిమ్స్‌ కార్డియో థోరాసిక్‌ విభాగాధిపతి అమరేశ్వరరావు, వైద్య బృందం, నిలోఫర్‌ ఆస్పత్రి వైద్యులు సర్జరీలలో పాల్గొంటారని పేర్కొన్నారు.నవజాత శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు గుండెలో రంధ్రం, గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స అందిస్తారని వివరించారు. వివరాలకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల్లోపు 040-23489025 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.

Leave A Reply

Your email address will not be published.