సీఎం పై పోటీగా సీనియర్ జర్నలిస్టు దించాలని బీసీ సంఘాల యోచన

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులను పోటీకి దింపాలని వివిధ జిల్లాలలో గల 26 బిసి సంఘాలు ఆలోచిస్తున్నట్లు బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కే సత్యనారాయణ తెలిపారు.అందులో భాగంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై గజ్వేల్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేటలో ఎక్కడ పోటి చేసిన సీనియర్ జర్నలిస్టును బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని పోటికి దింపాలని ఆలోచిస్తున్నాయి. ఆ జర్నలిస్టు ఉమ్మడి మెదక్ జిల్లాలో సీనియర్ తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. సీఎంపై పోటీకి నిలిపి బీసీ సంఘాలన్నీ ఆ నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా అక్టోబర్ మొదటి వారంలో హైదరాబాదులో సమావేశమై అభ్యర్థులను ప్రకటించాలని బీసీ సంఘాలు నిర్ణయించినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.