ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గ్రూప్ 1 పరీక్ష రద్దు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: నిరుద్యోగుల ఎడల కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిన దుర్మార్గపు ధోరణి మూలంగానే హైకోర్టు గ్రూపు 1 పరీక్షను రద్దు చేసిందని జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మహేష్ ఒక ప్రకటనలో విమర్శించారు. కేసీఆర్ పాలనకు పరాకాష్టనీ బీఅర్ఎస్ ప్రభుత్వం మొదటి నుండి ఉద్యోగాల భర్తీ విషయంలో మోసపూరితమైన వైఖరి, నిరుద్యోగుల పట్ల కపట ప్రేమ తేటతెల్లం మైనదని పేర్కొన్నారు.గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదు. కెసిఆర్ ప్రభుత్వానికి నిజాయితీగా, చిత్తశుద్ధితో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం కూడా చేతకానీ ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది బి. అర్ ఎస్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు.తెలంగాణా ప్రభుత్వం ఒక పక్క అడ్డదిడ్డంగా, ఇష్టానుసారంగా నోటిఫికేషన్లు ఇవ్వడం, మరో పక్క ఎవరో ఒకరు కోర్టుకెళ్లడం నోటిఫికేషన్పై కోర్టులు స్టే ఇవ్వడం వలన నిరుద్యోగులు అన్యాయం అవుతున్నారు.నేడు రాష్టంలో నిరుద్యోగులు అనేక అవాంతరాలు, అడ్డంకులు, కష్టాలు ఓర్చుకుని గ్రూప్ 1 పరీక్షను రాసిన అభ్యర్థుల ఆవేదన, ఆక్రందన ప్రభుత్వం తప్పకుండా తగులుతుంది. ప్రభుత్వం అర్థవంతంగా నిర్వహించని బయోమెట్రిక్ అభ్యర్థులది తీసుకోలేదనే కారణంగా హైకోర్టు ఈ రోజు గ్రూప్ 1 పరీక్షా రద్దు చేయడం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, TSPSC అసమర్థతే, పేపర్ లీకేజీతో ఇటీవలే రద్దయిన పరీక్షను పూర్తి స్థాయిలో నిర్వహించక పోవడం వల్ల, ఇప్పుడు మళ్లీ కోర్టు రద్దు చేయడం మూలాన నిరుద్యోగులు తీవ్రమైన మానసికమైన మనోవేదనకు గురి అవుతున్నారు. పేపర్ లీకేజీ పై కనీస బాధ్యత లేకుండా, రివ్యూ కూడా చేయటం చేతకాని దుస్థితి నెలకొంది. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులు అడుగడుగునా దగా, మోసం, నిర్లక్ష్యానికి గురయ్యారు. దీనికి పూర్తి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. తక్షణమే TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డిను తొలగించి బోర్డును ప్రక్షాళన చేయాలి. కెసిఆర్ ప్రభుత్వ నిర్లక్ష్య, మోసపూరిత వైఖరికి నిరసనగా ప్రభుత్వ డొల్లతనం బట్టబయలు చేస్తు నిరుద్యోగుల గోడు అవేశ ఆక్రందనలు వినిపించేలా పెద్ద ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమించాలని తట్టే మహేష్ పిలుపునిచారు.

Leave A Reply

Your email address will not be published.