ఆసియా గేమ్స్ లో భారత్ కు పథకాల పంట

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల షూటింగ్‌ విభాగంలో రెండో పతకం దక్కింది. ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో రమిత, మొహులీ ఘోష్‌, ఆషి చౌక్సీతో కూడిన జట్టు రజత పతకం నెగ్గింది. చైనా 1896.6 పాయింట్లతో గోల్డ్‌ మెడల్‌ సాధించగా, 1886 పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక 1880 పాయింట్లతో మంగోలియా జట్టు కాంస్య పతకం దక్కించుకుంది.ఇప్పుడు షూటర్‌ రమితా జిందాల్‌ (19) మరో పతకాన్ని భారత్‌ ఖాతాలో వేసింది. మహిళ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విభాగంలో 252.7 స్కోర్‌తో చైనాకు చెందిన హువాంగ్‌ యూటింగ్‌ బంగారు పతకం దక్కించుకోగా, చైనాకే చెందిన హాన్‌ జియాయు 251.3 స్కోర్‌తో సిల్వర్‌ నెగ్గింది. భారత్‌ షూటర్‌ రమిత జిందాల్‌ 230.1 స్కోర్‌తో కాంస్యం గెలుచుకుంది.కాగా, ఆసియా గేమ్స్‌ మహిళల షూటింగ్‌ వ్యక్తిగత విభాగంలో చైనా షూటర్ హువాంగ్‌ యూటింగ్ 252.7 స్కోర్‌ నమోదు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ విభాగంలో ఇంత స్కోర్‌ నమోదు కావడం ఇదే తొలిసారని నిర్వాహకులు తెలిపారు. కాగా, రమిత జిందాల్‌ నెగ్గిన కాంస్యంతో కలిపి భారత్‌ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. రోయింగ్‌లో రెండు పతకాలు వచ్చాయి.

 

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట

 

షూటింగ్‌లో భారత్‌కు రెండో పతకం..

 

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ విభాగంలో రమితకు కాంస్యం

 

హాంగ్జౌ సెప్టెంబర్ 24 (ఎక్స్ ప్రెస్ న్యూ స్);: ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల షూటింగ్‌ విభాగంలో రెండో పతకం దక్కింది. ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో రమిత, మొహులీ ఘోష్‌, ఆషి చౌక్సీతో కూడిన జట్టు రజత పతకం నెగ్గింది. చైనా 1896.6 పాయింట్లతో గోల్డ్‌ మెడల్‌ సాధించగా, 1886 పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక 1880 పాయింట్లతో మంగోలియా జట్టు కాంస్య పతకం దక్కించుకుంది.ఇప్పుడు షూటర్‌ రమితా జిందాల్‌ (19) మరో పతకాన్ని భారత్‌ ఖాతాలో వేసింది. మహిళ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విభాగంలో 252.7 స్కోర్‌తో చైనాకు చెందిన హువాంగ్‌ యూటింగ్‌ బంగారు పతకం దక్కించుకోగా, చైనాకే చెందిన హాన్‌ జియాయు 251.3 స్కోర్‌తో సిల్వర్‌ నెగ్గింది. భారత్‌ షూటర్‌ రమిత జిందాల్‌ 230.1 స్కోర్‌తో కాంస్యం గెలుచుకుంది.కాగా, ఆసియా గేమ్స్‌ మహిళల షూటింగ్‌ వ్యక్తిగత విభాగంలో చైనా షూటర్ హువాంగ్‌ యూటింగ్ 252.7 స్కోర్‌ నమోదు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ విభాగంలో ఇంత స్కోర్‌ నమోదు కావడం ఇదే తొలిసారని నిర్వాహకులు తెలిపారు. కాగా, రమిత జిందాల్‌ నెగ్గిన కాంస్యంతో కలిపి భారత్‌ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. రోయింగ్‌లో రెండు పతకాలు వచ్చాయి.

Leave A Reply

Your email address will not be published.