పోచారం శ్రీనివాసరెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన డబుల్ బెడ్ రూం కాలనీ వాసులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి బాన్సువాడ పట్టణ పరిధిలోని KCR నగర్- PSR డబుల్ బెడ్ రూం కాలనీ వాసులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఆదివారం తమ కాలనీలో ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమ్మేళనానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ముఖ్య అథితిగా ఆహ్వానించిన కాలనీ వాసులు తామంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికలో BRS పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని పోచారం కు అందజేశారు.

KCR నగర్- PSR కాలనీలో మొత్తం 1004 డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఉన్నాయి. 4000 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు.

స్వంత స్థలం, ఇల్లు లేని తాము కిరాయి ఇళ్ళలో, రోడ్లు పక్కన గుడిసెలలో నివసించేవాళ్ళం. గత డెబ్బై ఏళ్ళుగా మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. మాకు కూడా స్వంత ఇల్లు ఉంటే బాగుండు అని కల కనేవాళ్ళం

మనసున్న మహరాజా, పేదల పాలిట దేవుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు రూపాయి ఖర్చు లేకుండా మాకు డబుల్ బెడ్ రూం ఇంటిని ఇప్పించి మా స్వంత ఇంటి కలను నిజం చేశారు. ఇంటితో పాటుగా కాలనీలో మిషన్ భగీరధ మంచినీటి పైప్ లైన్లు, సిసీ రోడ్లు, డ్రైనేజీలు, కరంటు, స్కూల్, ఫంక్షన్ హాల్ లను ఏర్పాటు చేయించారు. హైదరాబాద్ లోని ధనవంతులు నివసించే గేటెడ్ కమ్యునిటీ లాగ తీర్చిదిద్దారు.

ఈరోజు పిల్లాపాపలు, కుటుంబ సభ్యుతో కలిసి సుఖంగా ఉంటున్నాం అంటే దానికి కారణం పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.

జన్మజన్మలకు పోచారం  రుణం తీర్చుకోలేనిది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా కుటుంబాలతో సహా కారు గుర్తుకు ఓటు వేసి పోచారంను బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు.

మా గురించి ఏనాడూ పట్టించుకోని ఇతర పార్టీలు, నాయకులు ఎవ్వరూ కూడా మా KCR నగర్- PSR కాలనీలో అడుగు పెట్టవద్దు, మమ్మల్ని ఓట్లు అడగడానికి రావద్దని కాలనీ వాసులు తెలిపారు.

పోచారం శ్రీనివాసరెడ్డికి బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి MLA గా అవకాశం కల్పించిన BRS పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈసందర్భంగా తనకు సంపూర్ణ మద్దతు తెలిపిన కాలనీ వాసులకు పోచారం శ్రీనివాసరెడ్డి  ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కాలనీ వాసులకు అవసరమైన సేవలను ఇదేవిధంగా అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డి. అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, PACS చైర్మన్ కృష్ణా రెడ్డి లు, మున్సిపల్ వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.