ఆయా రాష్ట్రాలలో మరో తొమ్మిది వందే భారత్ రైళ్లు ప్రారంభం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఇండియన్‌ రైల్వేస్‌లో అధునాతన సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్‌ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే 25 వందే భారత్‌ రైళ్లు వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తుండగా తాజాగా మరో 9 రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీటిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కొత్త రైళ్లలో కాచిగూడ-యశ్వంత్‌పూర్‌, విజయవాడ-చెన్నై రైళ్లు కూడా ఉన్నాయి.కాచిగూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి జెండా ఊపి వందే భారత్‌ రైలును ప్రారంభించారు. విజయవాడలో జరిగిన వందే భారత్‌ రైలు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్‌ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని పలు నగరాల మధ్య ఈ రైళ్లు సేవలందిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.