అన్నింటికీ ఆధార్‌ సరికాదు..రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ సేవలను పొందేందుకు ఆధార్‌ను కీలకం చేశారని ప్రముఖ గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ పేర్కొంది. అయితే ఇంతటి ప్రధాన వ్యవస్థ విశ్వసనీయంగా లేకుంటే దేశ ప్రజలకు నష్టమేనని చెప్తున్నది.  అన్ని రకాల సర్కారీ సంక్షేమ పథకాల ప్రయోజనాలనూ దీనితోనే ముడి పెట్టారని గుర్తుచేసింది. అయితే ఇంతటి ప్రధాన వ్యవస్థ విశ్వసనీయంగా లేకుంటే దేశ ప్రజలకు నష్టమేనని చెప్తున్నది.  రేషన్‌ కార్డుకు.. బ్యాంక్‌ ఖాతాలకు.. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు.. ఆర్థిక కార్యకలాపాలకు.. గ్యాస్‌ సబ్సిడీలకు.. ఓటేసేందుకు.. మొబైల్‌ సిమ్‌కు.. చివరకు జనన, మరణాలకు.. ఇలా అన్నింటికి ‘ఆధార్‌’ ఒక్కటే ఆధారం. దేన్ని ధ్రువీకరించాలన్నా ఇది తప్పనిసరి. అయితే దేశంలో ఇంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆధార్‌ను.. ప్రస్తుత విధానాన్ని దండగగా పేర్కొన్నది ప్రముఖ గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌. ఈ 12 అంకెల బయోమెట్రిక్‌ టెక్నాలజీ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా ఉందంటూ హెచ్చరించింది మరి. నిజానికి దాదాపు ఏడాదిన్నర క్రితం భారతీయ అత్యున్నత ఆడిటర్‌.. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సైతం ఆధార్‌ లోపాలను ఎత్తిచూపడం గమనార్హం. డాటా నిర్వహణ లోపభూయిష్టంగా ఉందంటూ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) పనితీరుపట్ల తీవ్ర అసంతృప్తినే వ్యక్తం చేసింది.ముఖ్యంగా ఈ సమాచారంలో తప్పుల వల్ల అర్హులు ప్రభుత్వ రాయితీలను, ఇతరత్రా చేయూతల్ని అందుకోలేకపోతున్నారని చెప్పింది. భారత్‌లో ఇప్పటికీ కేవలం ప్రభుత్వ సబ్సిడీలపైనే ఆధారపడి జీవిస్తున్నవారు ఉన్నారని గుర్తుచేసిన మూడీస్‌.. అలాంటి వారందరికీ ఆధార్‌ వ్యవస్థలోని లోపాలు ఇబ్బందికరంగా మారాయన్నది. రోజువారీ శ్రామికులు సైతం ఆధార్‌తో నష్టపోతున్నారన్నది. మొత్తంగా ఉష్ణ, తేమతో కూడిన భారతీయ వాతావరణానికి ఆధార్‌ ప్రామాణిక సేవలు, విధానాలు సరిపోవని కుండ బద్దలు కొట్టింది.

 క్స్ ప్రెస్ న్యూస్ );: దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ సేవలను పొందేందుకు ఆధార్‌ను కీలకం చేశారని ప్రముఖ గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ పేర్కొంది. అయితే ఇంతటి ప్రధాన వ్యవస్థ విశ్వసనీయంగా లేకుంటే దేశ ప్రజలకు నష్టమేనని చెప్తున్నది.  అన్ని రకాల సర్కారీ సంక్షేమ పథకాల ప్రయోజనాలనూ దీనితోనే ముడి పెట్టారని గుర్తుచేసింది. అయితే ఇంతటి ప్రధాన వ్యవస్థ విశ్వసనీయంగా లేకుంటే దేశ ప్రజలకు నష్టమేనని చెప్తున్నది.  రేషన్‌ కార్డుకు.. బ్యాంక్‌ ఖాతాలకు.. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు.. ఆర్థిక కార్యకలాపాలకు.. గ్యాస్‌ సబ్సిడీలకు.. ఓటేసేందుకు.. మొబైల్‌ సిమ్‌కు.. చివరకు జనన, మరణాలకు.. ఇలా అన్నింటికి ‘ఆధార్‌’ ఒక్కటే ఆధారం. దేన్ని ధ్రువీకరించాలన్నా ఇది తప్పనిసరి. అయితే దేశంలో ఇంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆధార్‌ను.. ప్రస్తుత విధానాన్ని దండగగా పేర్కొన్నది ప్రముఖ గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌. ఈ 12 అంకెల బయోమెట్రిక్‌ టెక్నాలజీ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా ఉందంటూ హెచ్చరించింది మరి. నిజానికి దాదాపు ఏడాదిన్నర క్రితం భారతీయ అత్యున్నత ఆడిటర్‌.. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సైతం ఆధార్‌ లోపాలను ఎత్తిచూపడం గమనార్హం. డాటా నిర్వహణ లోపభూయిష్టంగా ఉందంటూ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) పనితీరుపట్ల తీవ్ర అసంతృప్తినే వ్యక్తం చేసింది.ముఖ్యంగా ఈ సమాచారంలో తప్పుల వల్ల అర్హులు ప్రభుత్వ రాయితీలను, ఇతరత్రా చేయూతల్ని అందుకోలేకపోతున్నారని చెప్పింది. భారత్‌లో ఇప్పటికీ కేవలం ప్రభుత్వ సబ్సిడీలపైనే ఆధారపడి జీవిస్తున్నవారు ఉన్నారని గుర్తుచేసిన మూడీస్‌.. అలాంటి వారందరికీ ఆధార్‌ వ్యవస్థలోని లోపాలు ఇబ్బందికరంగా మారాయన్నది. రోజువారీ శ్రామికులు సైతం ఆధార్‌తో నష్టపోతున్నారన్నది. మొత్తంగా ఉష్ణ, తేమతో కూడిన భారతీయ వాతావరణానికి ఆధార్‌ ప్రామాణిక సేవలు, విధానాలు సరిపోవని కుండ బద్దలు కొట్టింది.

Leave A Reply

Your email address will not be published.