ఈ కేవైసీ అప్ డేట్ పేరుతో రేషన్ షాపులో వసూళ్లు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఈ కేవైసీ అప్డేట్ పేరిట రేషన్ షాపుల్లో 50 రూపాయల వసూళ్లు…. వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ నుండి రేషన్ కార్డుల్లో నమోదైన అభ్యర్థులు తప్పనిసరిగా రేషన్ షాపులో కెళ్ళి ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకుగాను ప్రజల నుండి సంబంధిత డీలర్ లు ఎలాంటి డబ్బులు వసూలు చేయొద్దని పక్కాగా ఆదేశించినప్పటికీ హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలోని పలు రేషన్ షాపులలో డీలర్లు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.రేషన్ కార్డులోకుటుంబ సభ్యుల పేర్లు ఈకేవై సి అప్డేట్ చేయడంతో పాటు వారికి ఒక బుక్ బైండింగ్ కాపీ అందజేసి అక్రమంగా 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందించే రేషన్ షాపులలో ఈ విధంగా అక్రమాలు జరగడం శోచనీయం ఏది ఏమైనప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఈ అక్రమ దోపిడీని అరికట్టి ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండా ఈ కేవైసీ అప్డేట్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.