భగత్ సింగ్ పేరు వింటే ప్రతి భారతీయుని గుండె గర్వంతో నిండిపోతుంది

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ 116వ జయంతిని ఘట్కేసర్ బిజెపి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఘట్కేసర్ మండల ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని భగత్ సింగ్  చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటాల్లో యువతకు స్పూర్తి భగత్ సింగ్ గారని బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసి దేశ స్వాతంత్య్రం కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడతడు.

భగత్ సింగ్ చదువుతున్న రోజుల్లోనే జులియన్ వాలాబాగ్ దుర్ఘటనతో చలించిపోయారని దేశ స్వాతంత్ర్యం కోసం 23 సంవత్సరాలకే ప్రాణత్యాగం చేసి ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బెల సురేష్, బిజెపి కాచవాని సింగారం గ్రామ శాఖ అధ్యక్షులు అశోక్ ముదిరాజ్, పోచారం మున్సిపల్ కిసాన్ మోర్చా అధ్యక్షులు వీరారెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ బీజేవైఎం ఉపాధ్యక్షులు అనిల్ గౌడ్, నాయకులు బసవరాజు గౌడ్, మచ్చేందర్ రెడ్డి, ప్రవీణ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.