వెండి ఆభరణాల కొనుగోలులో నాణ్యత మోసాలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మసాబ్ టాంక్ రెడ్ క్రాస్ సమావేశం హాలులో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హల్ మార్కింగ్ విధానం పై వినియోగదారుల చైతన్య సదస్సు జరిగింది. రెడ్ క్రాస్ చైర్మన్ మామిడి భీం రెడ్డి అధ్యక్షతన ముఖ్య అతిథిగా సిసిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, సిసిఐ గౌరవ సభ్యులు దొంతి శిల్పారెడ్డి, సౌత్ రాష్ట్రాల సంయుక్త కార్యదర్శి డా. హరిప్రియా రెడ్డి లు పాల్గొన్నారు. మహిళలు ఎక్కువ శాతం బంగారు, వెండి ఆభరణాల కొనుగోలు లో నాణ్యతా పరంగా మోసపోతుంటారని, కాబట్టి వారికి బంగారు, వెండి ఆభరణాలపై బిఐఎస్ హల్ మార్కింగ్ మరియు హుచ్ యుఐడి విధానాలపై అవగాహన తప్పనిసరి అని సాంబరాజు చక్రపాణి అన్నారు. (సిసిఐ) రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత పండుగల సందర్భంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బంగారు ఆభరణాలపై హల్ మార్కింగ్ ముద్ర నాణ్యత కు గుర్తు అని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు మామిడి భీం రెడ్డి మాట్లాడుతూ, ప్రతీ కొనుగోలు కు తప్పనిసరి గా రశీదు తీసుకోవాలని వినియోగదారులకు సూచించారు. సిసిఐ ఆద్వర్యంలో మహిళలకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ పై శిక్షణా శిబిరాల ఆవశ్యకత ఉన్నదని తెలిపారు. అనంతరం హల్ మార్కింగ్ విధానం లో వినియోగదారుల రక్షణ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసారు.

Leave A Reply

Your email address will not be published.