ఇలాంటి మంత్రిని నేను ఎక్కడా చూడలేదు
ఇలా తప్పుడు సమాచారం ఇచ్చే మంత్రిని తానూ ఇప్పటివరకు చూడలేదని తెలంగాణ రాష్త్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావ్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి KTR ట్విటర్ వేదికగా విమర్శలకు దిగారు. ‘నేను మిమ్మల్ని సోదరుడిగా గౌరవిస్తాను. కానీ, ఇలా తప్పుడు సమాచారం ఇచ్చే దురదృష్టకరమైన కేంద్ర మంత్రిని చూడలేదు. TSకు కేంద్రం 9 మెడికల్ కాలేజీలు ఇచ్చింది అనేది అబద్ధం. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఏపీఆర్డీలో TSకు గానీ, సోదర రాష్ట్రమైన APకు గానీ.. ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడం సిగ్గుచేటు’ అని ట్వీట్ చేశారు.