10 మీట‌ర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్‌లో షూట‌ర్ పాల‌క్ స్వ‌ర్ణ ప‌త‌కం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆసియా క్రీడ‌ల్లోభార‌త షూట‌ర్లు దుమ్మురేపుతున్నారు. షార్ప్ షూటింగ్ స్కిల్స్‌ను ప్ర‌ద‌ర్శిస్తూ.. తమ ఖాతాల్లోకి మెడ‌ల్స్ వేసేసుకుంటున్నారు. టీమ్ ఈవెంట్ల‌తో పాటు వ్య‌క్తిగ‌త ఈవెంట్ల‌లోనూ భార‌త షూట‌ర్లు రాణిస్తున్నారు. శుక్రవారం  జ‌రిగిన మ‌హిళ‌ల వ్య‌క్తిగ‌త ఈవెంట్‌లో భార‌త షూట‌ర్లు పాల‌క్‌ఇషా సింగ్‌.. ఇద్ద‌రూ టాప్ ప్లేస్ కొట్టేశారు. 10 మీట‌ర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్‌లో షూట‌ర్ పాల‌క్ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్న‌ది.17 ఏళ్ల ఆ షూట‌ర్ .. అంద‌రి అంచ‌నాల్ని త‌ల‌కిందులు చేస్తూ సూప‌ర్ స్కిల్స్‌ను ప్ర‌ద‌ర్శించింది. పాల‌క్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. వ్య‌క్తిగ‌త ఈవెంట్‌లో పాల‌క్ ముందు నుంచే దూసుకెళ్లింది. 13 షాట్స్ త‌ర్వాత ఆమె 131.4 స్కోర్‌తో లీడింగ్‌లో ఉంది. 23 షాట్స్ త‌ర్వాత పాలక్‌.. 232.6 స్కోరుతో, ఇషా సింగ్ 229.2 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి సిల్వ‌ర్ మెడ‌ల్‌ను కైవ‌సం చేసుకున్న‌ది.

Leave A Reply

Your email address will not be published.