ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ ను జారీ చేయ‌డం చ‌ట్ట‌ప‌ర‌మైన లంచం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ ను జారీ చేయ‌డం చ‌ట్ట‌ప‌ర‌మైన లంచం అని కాంగ్రెస్ నేత చిద‌రంబ‌రం ఆరోపించారు. అక్టోబ‌ర్ 4వ తేదీ నుంచి ప‌ది రోజుల పాటు ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ను ఓపెన్ చేస్తున్న‌ట్లు ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత చిదంబ‌రం ఆ ఆరోప‌ణ‌లు చేశారు. బీజేపీ స‌ర్కార్‌కు ఇది బంగారు పంట‌గా మారుతుంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. 28వ సారి ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ను అనుమ‌తి ఇస్తూ కేంద్ర స‌ర్కారు శుక్ర‌వారం ప్ర‌క‌ట‌న జారీ చేసింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన‌ అన్ని బ్రాంచిలలో అక్టోబర్‌ 4 నుంచి 13న వరకు 28వ విడత ఎలక్టోరల్‌ బాండ్లను విక్రయించనున్నట్టు కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది.రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, తెలంగాణ‌, మిజోరం రాష్ట్రాల్లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రం ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ను విక్ర‌యించ‌నున్న‌ట్లు తెలిపింది. గ‌త రికార్డుల‌ను దృష్టిలో పెట్టుకుంటే, ఆ బాండ్ల‌లో 90 శాతం వ‌ర‌కు బీజేపీకి వెళ్ల‌నున్న‌ట్లు కాంగ్రెస్ నేత చిదంబ‌రం ఆరోపించారు. ఆశ్రిత పెట్టుబ‌డిదారులు త‌మ చెక్ బుక్‌ల‌ను ఓపెన్ చేసి ఢిల్లీలో ఉన్న త‌మ మాస్ట‌ర్ కోసం సంత‌కాలు చేస్తార‌ని పేర్కొన్నారు. ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ను లీగ‌ల్ బ్రైబ‌రీగా ఆయ‌న విమ‌ర్శించారు.పొలిటిక‌ల్ ఫండింగ్‌లో పారద‌ర్శ‌క‌త కోసం నేరుగా న‌గ‌దు విరాళాలు కాకుండా దానికి ప్ర‌త్యామ్నాయంగా ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. మార్చి 2018లో తొలిసారి ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ను విక్ర‌యించ‌డం మొద‌లుపెట్టారు. కేవ‌లం స్టేట్ బ్యాంక్ ఇండియాలో మాత్ర‌మే ఆ బాండ్ల‌ను విక్ర‌యిస్తారు.

Leave A Reply

Your email address will not be published.